AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections: ఓటర్లకు గుడ్‌న్యూస్.. రేపు వేతనంతో కూడిన సెలవు ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది.

Municipal Elections: ఓటర్లకు గుడ్‌న్యూస్.. రేపు వేతనంతో కూడిన సెలవు ప్రకటన!
Telangana Municipal Elections
Anand T
|

Updated on: Feb 10, 2026 | 9:17 AM

Share

తెలంగాణలో మున్సిపల్‌ పోరుకు సర్వం సిద్దమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా 52 లక్షల మందిపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బుధవారం పట్టణ స్థానిక ఎన్నికలు జరిగే నగరపాలికలు, మున్సిపాలిటీల పరిధిలోని అందరూ కార్మికులు, ఉద్యోగులకు ఆ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు ప్రతి ఒక్క పౌరుడి హక్కని ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us