AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నన్ను గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116 ఇస్తా’.. హామీ పత్రం రాసిన అభ్యర్థి!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే చేసే పనుల హామీ పత్రాన్ని విడుదల చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5116 ఇస్తానని హామీ ఇస్తున్నారు.

‘నన్ను గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116 ఇస్తా’.. హామీ పత్రం రాసిన అభ్యర్థి!
Candidates Making Bizarre Promises
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 7:35 PM

Share

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. ఎన్నికల్లో ప్రజల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. హామీలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే చేసే పనుల హామీ పత్రాన్ని విడుదల చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5116 ఇస్తానని హామీ ఇస్తున్నారు.

పట్టణ ప్రాంతాల్లో రాజకీయ జీవితంలో వార్డు కౌన్సిలర్ పదవి మొదటి అడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమపై ఓటర్లకు నమ్మకం కలిగేలా ఏకంగా హామీల పత్రాలను విడుదల చేస్తున్నారు. తమను ఎన్నుకుంటే వార్డుకు చేయబోయే పనులు ఇవేనంటూ ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు.

జిల్లా కేంద్రమైన సూర్యాపేట మున్సిపాలిటీలో పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రచారం హోరెత్తుతోంది. 45వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. వార్డు కౌన్సిలర్ గా తనను ఎన్నుకుంటే వార్డులోని ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5116 ఇస్తానని ఆమె తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 45వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా కుర్చీ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆమె తెలిపారు.

45 వ వార్డు పరిధిలో ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.5116, అంత్యక్రియలకు పదివేల రూపాయలు, వార్డులోని ప్రతి వీధికి సీసీ కెమెరాలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తానని నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న హామీ ఇస్తున్నారు. అంతేకాదు పిల్లలకు ఉచితంగా ట్యూషన్ తో పాటు, వార్డులో మహిళలకు కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పిస్తానని, వార్డులో ఏర్పాటు చేసుకున్న ప్రతి వినాయక చవితికి విగ్రహం ఏర్పాటుకు 20వేల రూపాయలు ఇస్తానని హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహిస్తానని ఆమె చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థి నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్నకు మద్దతుగా ఆమె బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి హామీల వర్షంతో వార్డు ప్రజల విశ్వాసం చూరగొంటారో లేదో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..