AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుర పోరు ప్రచారంలో పదనిసలు.. పిల్లాడికి స్నానం చేయించి తల్లిదండ్రులను ఓటు అడిగిన MLA..!

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి తరఫున ప్రచారం చేస్తున్న నేతల వింత వింత వేషాలు, వింత చేష్టలతో ఓటర్లను అబ్బుర పరుస్తున్నాయి.. సాధారణ ఎన్నికలను మరిపించే తరహాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే ఓ బుడ్డోడికి స్నానం పోయడం అక్కడ చర్చగా మారింది.

పుర పోరు ప్రచారంలో పదనిసలు.. పిల్లాడికి స్నానం చేయించి తల్లిదండ్రులను ఓటు అడిగిన MLA..!
Mla Murali Naik
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 5:08 PM

Share

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి తరఫున ప్రచారం చేస్తున్న నేతల వింత వింత వేషాలు, వింత చేష్టలతో ఓటర్లను అబ్బుర పరుస్తున్నాయి.. సాధారణ ఎన్నికలను మరిపించే తరహాలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే ఓ బుడ్డోడికి స్నానం పోయడం అక్కడ చర్చగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. 260 వార్డులకు 1,072 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుర పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలువురు ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు ప్రచారంలో పడరాన్ని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చిరు వ్యాపారులు, బడ్డి కొట్టు వ్యాపారులు, పట్టణ ప్రజలను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రచార నిర్వహిస్తున్నారు.

మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక MLA మురళీ నాయక్ డిఫరెంట్ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 17 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలు చౌహాన్ తరుపున ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ క్రమంలో ఓ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే తన చేష్టలతో అందర్నీ షాక్ కు గురి చేశారు. బుడ్డోడికి స్నానం చేయిస్తున్న తల్లి వద్దకు వెళ్లిన మురళీ నాయక్, పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకుని స్నానం చేయించారు. పిల్లాడు తల్లిదండ్రులను తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇక మహబూబాబాద్ 29 వ వార్డులో సిపిఎం పార్టీ నుండి బరిలోకి దిగిన సుర్ణపు సోమయ్య అనే అభ్యర్థి, పలు కులవృత్తి పనులు చేసి అందర్నీ ఆకర్షించారు. అదే కాలనీలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంగళంపల్లి రాజ్ కుమార్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.

మరోవైపు వర్ధన్నపేట మున్సిపాలిటీలో ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల వింత వింత ప్రచారాలు, నేతల విచిత్ర చేష్టలు ఓటర్లను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..