AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Krishna Vamsi: ఆ సినిమా బాలేదంటే ప్రభాస్ కొడతాడు.. ఫ్యాన్స్ మాత్రం చూడలేకపోయారు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్ మనసులు దొచుకున్నారు. ఒకప్పుడు హిట్ చిత్రాలతో బిజీ దర్శకుడిగా ఉన్నారు. కానీ కొన్నాళ్లుగా ఆయన అంతగా సినిమాలను తెరకెక్కించడం లేదు. ఓ ఇంటర్వ్యూలో సినిమా ఫలితాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభాస్ కేవలం తన సూచనలను పాటించారని, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం తన వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు.

Director Krishna Vamsi: ఆ సినిమా బాలేదంటే ప్రభాస్ కొడతాడు.. ఫ్యాన్స్ మాత్రం చూడలేకపోయారు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
Krishna Vamsi, Prabhas
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2026 | 5:22 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల సినిమా విజయాలు, అపజయాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. సినిమా ఫలితాలు కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉండవని, హిట్ అయితే హీరోలు, నిర్మాతలు, సంగీత దర్శకులు, రచయితలు తమ వల్లే విజయం వచ్చిందని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే అపజయం వచ్చినప్పుడు మాత్రం అందరూ దర్శకుడినే నిందిస్తారని, “విజయానికి అనేక మంది తండ్రులుంటారు, అపజయం అనాథ” అనే నానుడిని ఆయన గుర్తుచేశారు. అపజయం ఎదురైనప్పుడు బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారని, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానవ సహజమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

తాను దర్శకత్వం వహించిన సినిమాల విషయానికి వస్తే, వాటి ఫలితం ఏమైనప్పటికీ పూర్తి బాధ్యత తనదేనని కృష్ణవంశీ చెప్పారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన చక్రం చిత్రం విషయంలో తానే ఎక్కువ బాధ్యుడినని తెలిపారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌కు కూడా ఈ సినిమా ప్లాప్ కావడానికి సగం బాధ్యత ఉందని చెప్పినప్పటికీ, ఇప్పుడు ప్రభాస్ తన ఆదేశాలను మాత్రమే పాటించారని, కాబట్టి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఆ చిత్రం నుంచి ఆశించిన అవుట్‌పుట్‌ను తాను అందించలేకపోయానని కృష్ణవంశీ పేర్కొన్నారు. కానీ థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయిన చక్రం చిత్రం, ఆ తర్వాత టీవీలు, ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు కల్ట్ క్లాసిక్ హిట్ గా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ప్రేక్షకుల అభిరుచి మారిందా, లేక థియేటర్లలో చూసిన వారే మళ్ళీ కొత్త ఆలోచనతో చూశారా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఒకరకమైన అంచనాలుంటాయని, టీవీ లేదా ఓటీటీలో చూసినప్పుడు మరో రకమైన అనుభూతి కలుగుతుందని ఆయన వివరించారు. ఈ పరిణామం నేపథ్యంలో చక్రం సినిమాను చెత్త సినిమా అనలేమని, అలా అంటే ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అంగీకరించరని ఆయన అన్నారు. చివరగా, హిట్ సినిమా వేరని, మంచి సినిమా వేరని, జనాలకు నచ్చిన సినిమా వేరని కృష్ణవంశీ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us