AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రేమలో పడాలని ఉందన్న ప్రభాస్.. ఎవరో ఆ లక్కీ గర్ల్.. అంటూ మురిసిపోతున్న అభిమానులు

రాజా సాబ్ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాల స్పీడ్ పెంచారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2తో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వార్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది.

Prabhas: ప్రేమలో పడాలని ఉందన్న ప్రభాస్.. ఎవరో ఆ లక్కీ గర్ల్.. అంటూ మురిసిపోతున్న అభిమానులు
Prabhas
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2026 | 1:14 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ఈ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో పాటు ఫౌజీ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డారు. చిన్న గాయమే కావడంతో ప్రభాస్ త్వరగానే కోలుకున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ప్రభాస్ పేరే ముందుగా చెప్తారు.

ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రభాస్ ఓ సినిమా ఈవెంట్ లో త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని అన్నారు. తాజాగా ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాకు లవ్ చేయాలని ఉంది అంటూ ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్ కొత్త లుక్ ఫౌజీ సినిమా కోసం అని ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా కపుల్ ఫ్రెండ్లీ మూవీ హీరోయిన్ మానస.. ప్రభాస్‌ను ప్రేమ గురించి అభిప్రాయం ఏంటి అని అడిగింది. దానికి ప్రభాస్ అన్సార్ ఇస్తూ.. ఇది నీ పర్సనల్‌ క్వశ్చన్‌ కదా అని సరదాగా అనేసి నవ్వేశాడు. అలాగే తనకు ప్రేమించాలనుందని, ప్రేమలో పడాలనుందని అన్నారు ప్రభాస్. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది. ఆ మూమెంట్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అన్నారు ప్రభాస్. ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రభాస్ ప్రేమలో పడితే చూడాలని ఉందని, ఆయన పెళ్లి చేసుకొని, పిల్లని కానీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని అభిమానులు ఆశపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us