AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay- Rashmika: విజయ్, రష్మిక పెళ్ళికి టైట్ సెక్యూరిటీ.. రంగంలోకి విదేశీ ఏజెన్సీ

టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. అలాగే పెళ్లి కార్డుల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్-రష్మికల పెళ్లి జరగనుంది.

Vijay- Rashmika: విజయ్, రష్మిక పెళ్ళికి టైట్ సెక్యూరిటీ.. రంగంలోకి విదేశీ ఏజెన్సీ
Vijay, Rashmika
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2026 | 12:09 PM

Share

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొద్ది రోజుల్లో వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇన్నాళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లిపీటలెక్కనున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26న ఉదయపూర్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అయితే వీరి పెళ్ళికి కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరు కానున్నారు. విజయ్, రష్మిక వివాహంకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితల మధ్యనే జరగనుంది. ఆతర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఇద్దరి పేళ్ళి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

ఇదిలా ఉంటే వీరి వివాహానికి కట్టుదిట్టమైన భద్రత ఉండనుందని తెలుస్తుంది. విజయ్, రష్మిక పెళ్ళికి టైట్ సెక్యూరిటీ కోసం విదేశీ ఏజెన్సీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండగా ప్రశాంతంగా వివాహం చేసుకునేందుకు.. ఆహ్వానించని అతిధులు రావడం, ఫోటోలు, వీడియోలు తీస్తూ హడావిడి చేయడం వంటివి లేకుండా ఉండేదుకు ఈ ఎంజెన్సీని నియమించుకున్నారని తెలుస్తుంది.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

కాగా విజయ్ రష్మిక కలిసి గీతగోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. గీతగోవిందం సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. వీరి రిలేషన్ ను చాలా వరకు గోప్యంగా ఉంచారు. కానీ అభిమానులు వీరి పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచారు. ఇక ఇప్పుడు ఇద్దరూ వివాహం చేసుకోనుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us