Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న స్పందనను దూరం పెడుతోందని మహేష్ అనే యువకుడు సుత్తితో దాడి చేశాడు. ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సూర్యాపేటలో ప్రేమ సంబంధిత దాడుల పరంపరలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న యువతి దూరం పెడుతోందనే కోపంతో ఓ యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేటలోని స్నేహానగర్‌లో జరిగింది. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్, అలుగునూరుకు చెందిన స్పందన ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది. ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్మానించారు. దీని తర్వాత స్పందన మహేష్‌ను దూరం పెడుతూ వచ్చింది. ఆగ్రహించిన మహేష్, స్పందన తన సోదరి ఇంట్లో ఉందని తెలుసుకొని, ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లి ఆమె తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

