AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loans: ఎలాంటి హామీ లేకుండానే రూ.20 లక్షల వరకు లోన్.. కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం.. అర్హతలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు, వ్యాపారులు, మహిళలకు రుణాలు అందిస్తోంది. వీటికి ఎలాంటి హామీ లేకుండానే తీసుకోవచ్చు. ఎలాంటి ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం అనేదే ఉండదు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ రుణాలు తీసుకోవచ్చు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Bank Loans: ఎలాంటి హామీ లేకుండానే రూ.20 లక్షల వరకు లోన్.. కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం.. అర్హతలు ఇవే..
Bank Loan
Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 12:09 PM

Share

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం బ్యాంక్ లోన్లను మంజూరు చేస్తోంది. ఎలాంటి హామీ లేకుండా వీటిని దేశంలోని ప్రజలు పొందవచ్చు. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, నిరుద్యోగులు, వ్యాపారులకు కేంద్రం ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టుకుండానే రుణ సౌకర్యం కల్పిస్తోంది. ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల్లో ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీమ్స్‌తో ఏమీ తాకట్టు పెట్టకుండానే సులువుగా మీ బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. ఆ స్కీమ్ ఏంటి..? ఎలాం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముద్రా లోన్

నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి పొందాలనుకునేవారు, చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారి కోసం ఈ పథకం బెస్ట్ ఆప్షన్‌కు చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది. అంతేకాకుండా ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీతో లోన్ పొందవచ్చు. ఇందుకు డాక్యుమెంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ముద్రా లోన్ స్కీమ్ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాయి. మీ వ్యాపారాన్ని బట్టి లోన్ అందిస్తారు. మీరు లోన్ తీసుకున్న తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే లోన్ లిమిట్ అనేది పెంచుతూ ఉంటారు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా లేదా వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవాలన్నా ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

స్టాండప్ ఇండియా స్కీమ్

ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. దాదాపు రూ.కోటి వరకు ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు. ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్స్, చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ రుణాలు అందిస్తారు. ఇందుకు మీరు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా కొలాటరల్ ఫ్రీ బిజినెస్ లోన్. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థల ద్వారా ఈ లోన్ తీసుకోవచ్చు.

సీజీటీఎం‌ఎస్‌ఈ రుణాలు

క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మెక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్(CGTMSE) పేరుతో స్టార్టప్స్, ఎంఎస్‌ఎంఈఎస్, చిన్న వ్యాపారులకు కేంద్రం ఈ పథకం ద్వారా లోన్లు ఇస్తోంది. ఎలాంటి హామీ, ఆస్తులు తాకట్టు పెట్టకుండానే ఈ లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ లోన్లు పొందాలంటే మీకు సిబిల్ స్కోర్ నిబంధనల ప్రకారం ఉండాలి. ఇక క్రెడిట్ హిస్టరీ, లోన్ రీపేమెంట్ ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తారు.

Follow Us