అందాల రితిక నాయక్ ఆఫర్స్ అందుకోలేకపోతుందా.? 

Rajeev 

Pic credit - Instagram

19 February 2026

యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్.. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

 ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. విమెన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంది.

2019 నుంచి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఇటీవలే మిరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా.. వరుణ్ తేజ్ జోడిగా నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. రెగ్యులర్ గా తన ఫొటోలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.