AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇందేది మావ..! ఈ హీరోయిన్ బాహుబలిలో అనుష్క డూప్‌గా చేసిందా.!!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు అనుష్క శెట్టి. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇందేది మావ..! ఈ హీరోయిన్ బాహుబలిలో అనుష్క డూప్‌గా చేసిందా.!!
Anushka Shetty
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2026 | 8:18 AM

Share

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఏ సినిమా చూసిన అనుష్కనే హీరోయిన్ గా కనిపించేది. స్టార్ హీరోలు , టాప్ డైరెక్టర్స్ కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వారు. ఇక అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బాహుబలి ఒకటి. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా ప్రతినాయకుడిగా నటించి అలరించారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం ఇంతా ఇంతా కాదు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ లో బానిసగా.. సెకండ్ పార్ట్ లో యువరాణి గా నటించి అలరించింది. ఈ సినిమాతో అనుష్క రేంజ్ పెరిగిపోయిందనే చెప్పాలి.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

బాహుబలి సినిమాలో అనుష్క నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఒక పాత్రలో ప్రభాస్ తల్లిగా.. మరో పార్ట్ లో ప్రభాస్ భార్యాగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె కూడా ఓ హీరోయిన్.. ఈ అమ్మడు చూడటానికి అచ్చం అనుష్క లానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. అదే హైట్ , అదే కలర్ తో ఉంటారు. ఇంతకు అమ్మడు ఎవరు అంటే.. రుషిక రాజ్. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ భామ. ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది రుషిక రాజ్.

ఇవి కూడా చదవండి

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

అనుష్కకు డూప్ గానే కాదు. బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఘాటీ అనే సినిమాలో నటిస్తుంది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమాలో అనుష్క చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us