AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆగిన ఎన్నికలు.. కారణం ఏంటంటే..?

కోర్టులో కేసుల కారణంగా ఏపీలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయ్. దీనిపై సుప్రీంకోర్టులో నవంబర్ 17న తుది విచారణ జరగనుంది. ఇంతకీ ప్రస్తుతం ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలేంటి..? అసలు వివాదమేంటి..? ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి..

AP Local Body Elections: ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆగిన ఎన్నికలు.. కారణం ఏంటంటే..?
Andhra Pradesh Local Body Elections
Shaik Madar Saheb
|

Updated on: Oct 15, 2026 | 11:45 AM

Share

ఏపీలో 123 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఉండగా ప్రస్తుతం 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు మాత్రమే ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ అయింది. సుప్రీంకోర్టులో కేసుల కారణంగా 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలకు ప్రస్తుతం నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. సుప్రీంకోర్టు కేసులు క్లియర్ కాగానే ఆ 23 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఏపీ ఎలక్షన్ ప్రధాన కమిషనర్. సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. విలీన ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అన్ని పిటిషన్లపై నవంబర్ 17న సుప్రీంకోర్టులో తుది విచారణ జరగబోతోంది. న్యాయపరమైన వివాదం కారణంగా ఎన్నికలు నిర్వహించలేని పట్టణ స్థానిక సంస్థల జాబితాలో మొత్తం 23 ప్రాంతాలున్నాయి. వీటిలో రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి, శ్రీకాకుళం లాంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ఏలూరు జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంతో పాటు.. ఏలూరు జిల్లా చింతలపూడి మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడలేదు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో విలీన గ్రామాల ప్రజలు కోర్టును ఆశ్రయించారు. తణుకులో వార్డుల డీలిమిటేషన్ కారణంగా ఎన్నికలు ఆగాయి.

రాజమండ్రి కార్పొరేషన్‌కు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. విలీన గ్రామాల ప్రజలు రాజమండ్రి కార్పొరేషన్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పిటిషన్ హైకోర్టులో.. విచారణ దశలో ఉన్న కారణంతో ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేశారు. కుశాలపురం పంచాయతీ విలీనంపై గ్రామస్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు ఆగాయి. 2005 తర్వాత శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు. 12ఏళ్లుగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఎన్నికలు జరగడం లేదు. ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైంది. విలీన గ్రామాలు కేసు, వార్డుల విజభన పెండింగ్ ఉండటంతో.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వలేదు.

విజయనగరం జిల్లా రాజాం నగర పంచాయతీలో కోర్టు కేసుల కారణంగా 21ఏళ్లు ఎన్నికలు జరగలేదు. ఇటీవలే విలీన గ్రామాల పిటిషనర్లు కేసు విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. వార్డుల విభజన పూర్తికాకపోవడంతో.. రాజాంలోనూ ఎన్నికల జరపడం లేదు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీకి చివరగా 2014లో ఎన్నికలు జరిగాయి. వార్డుల విభజన సరిగా లేదని టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడంతో.. గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయినప్పటికీ కోర్టు వివాదం కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ఎన్నికలు ఆగాయి. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, గుంటూరు జిల్లాలోని పొన్నూరు, బాపట్ల జిల్లాలోని బాపట్ల మున్సిపాలిటీతో పాటు మంగళగిరి కార్పొరేషన్‌ ఎన్నికలకు బ్రేక్ పడింది. వార్డుల పునర్విభజన, ఓటర్ జాబితా, రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో ఎన్నికలు ఆపారు.

కావలి మున్సిపాలిటీ పరిధిలో తమను కలపొద్దు అంటూ కావలి రూరల్ మండలం చౌదరిపాలానికి చెందిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో గతంలో ఇక్కడ ఎన్నికలు జరగలేదు. అల్లూరు నగర పంచాయతీ, గూడూరు మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల ప్రజలు కోర్టును ఆశ్రయించడంతో రెండుచోట్ల ఎన్నికలు జరగడం లేదు. మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీలోనూ సేమ్ సీన్. విలీన గ్రామాల ప్రజలు కోర్టు మెట్లెక్కడంతో ఎన్నిక ఆగింది. ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో వార్డుల విభజన ఆలస్యం కావడంతో తొలిదశలో ఎన్నికలు జరపడం లేదు. బి. కొత్తకోట మున్సిపాలిటీపై కోర్ట్ కేసు వెనక్కి తీసుకున్నా.. తుది తీర్పురాకపోవడంతో ఎన్నిక ఆగింది. అన్ని కేసులపై నవంబర్‌ 17న సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండటంతో.. కోర్ట్ కేసు క్లియర్‌ అయ్యి ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!