AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణంలో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం కొత్త రూల్స్..

విమాన ప్రయాణం చేస్తున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ బ్యాంక్‌లపై నిషేధం విధించింది. కేవలం ఎంకే-పీబీ-04 మోడల్‌ పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడంపై బ్యాన్ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి అలాంటి మోడల్ పవర్ బ్యాంకులను తీసుకెళ్లడం కుదరదు.

విమాన ప్రయాణంలో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం కొత్త రూల్స్..
Power Banks
Venkatrao Lella
|

Updated on: Oct 15, 2026 | 11:45 AM

Share

విమానాల్లో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రయాణికులు పవర్ బ్యాంక్‌లు తమ వెంట ఎక్కువగా తీసుకెళ్తుంటారు. ఇటీవల విమానాల్లో పవర్ బ్యాంక్‌లు పేలి అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఫ్లైట్‌లో కలకలం రేగడంతో.. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఫ్లైట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానాన్ని వెంటనే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఈ క్రమంలో విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వినియోగంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీంతో తాజాగా వాటిని విమానాల్లో వాడటంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బ్యాన్

ఇక నుంచి విమానాల్లో ఎంకే-పీబీ-04 మోడల్‌ పవర్ బ్యాంక్‌లు ఉపయోగించడానికి వీల్లేదు. ఈ మేరకు డీజీసీఏ నిషేధం అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని విమానాల్లోకి అనుమతించరు. అలాగే రవాణా చేయడంపై కూడా బ్యాన్ విధించారు. ఈ మేరకు విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల లగేజీ, క్యాబిన్ బ్యాగుల్లో వాటిని తీసుకెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే కార్గోలలో కూడా వీటిని అనుమతించవద్దని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఇటీవల పవర్ బ్యాంక్‌లు పేలి వరుస అగ్నిప్రమాదాలు చెలరేగుతున్న క్రమంలో డీజీసీఏ ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. అయితే పవర్ బ్యాంక్‌ల తయారీలో లిధియం అయాన్, లిథియం పాలిమర్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అధిక వేడికి గురైనప్పుడు వీటికి మండే స్వభావం ఉంటంది. దీంతో మండినప్పుడు మంటలు వచ్చి అగ్నిప్రమాదం జరిగే ప్రమాదముంటుంది. దీంతో అధిక సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్‌లను విమానాల్లో తీసకెళ్లడంపై ఎప్పటినుంచో నిషేధం ఉంది. ఇక తక్కువ సామర్ధ్యం కలిగిన వాటిని కూడా లగేజీ బ్యాగ్‌లో కాకుండా తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అక్కడ పెట్టడానికి వీల్లేదు

పవర్ బ్యాంక్‌లను ఎప్పుడూ చేతికందేలా అందుబాటులో ఉంచుకోవాలి. ఓవర్ హెడ్ బిన్లు, లగేజీ బ్యాగుల్లో ఉంచకూడదు. కేవలం 100 వాట్స్ అవర్స్ సామర్థ్యం కలిగిన రెండు పవర్ బ్యాంక్‌లను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణంలో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ నుంచి మంటలు వస్తే వెంటనే ఛార్జింగ్ పెట్టడం ఆపేయాలి. మంటలు చెలరేగినప్పుడు ఒకేచోట ఉంచాలి. అనంతరం వెంటనే విమానంలో అందుబాటులో ఉండే సిబ్బందిని సమాచారం అందించాలి. బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఉన్న పవర్ బ్యాంక్‌లు మాత్రమే ఉపయోగించాలి.

Follow Us
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!