AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారి పై బాంబుల వర్షం.. 72 మంది మృతి

బంగారం తవ్వకాల కోసం వెళ్లిన కార్మికులపై మృత్యువు విమానం రూపంలో దూసుకొచ్చింది. సూడాన్‌-ఈజిప్ట్‌ సరిహద్దులో 72 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన సమయంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు. కొందరు కొండపైకి ఎక్కారు. దాడికి ఈజిప్ట్‌ వైమానిక దళమే కారణమని సూడాన్‌ మానవ హక్కుల సంస్థ 'ఎమర్జెన్సీ లాయర్స్‌' ఆరోపించింది.

బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారి పై బాంబుల వర్షం.. 72 మంది మృతి
72 Killed In Airstrike On Gold Mine At Egypt Disputed Border
Sharada V
|

Updated on: Oct 15, 2026 | 11:35 AM

Share

సూడాన్‌-ఈజిప్ట్‌ వివాదాస్పద సరిహద్దు జబల్‌ అల్‌-ఉకైదత్‌ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం తవ్వకాలు జరుపుతున్న కార్మికుల పై ఓ యుద్ధ విమానం దాడి చేసింది. ఉదయం 8 గంటల సమయంలో ఆకాశంలో విమానం కనిపించిందని  వరుసగా ఐదుసార్లు జరిపిన దాడుల్లో, చాలామంది ప్రాణాలు కోల్పోయారని యూసుఫ్‌ అనే కార్మికుడు మీడియాకు తెలిపాడు. దాడి జరిగిన సమయంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాడి మొదలవగానే ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ తలా ఓ దిక్కుకు పరుగులు తీశారనీ చెప్పాడు.

కొంతమంది అల్‌-అన్సారీ మార్కెట్‌ వైపు వెళ్లగా.. మరికొందరు మరో దారిలో వెళ్లిపోయారనీ తాము పారిపోతున్న సమయంలో నేలపై మృతదేహాలు కనిపించాయని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని ప్రాణాలతో బయటపడిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని పట్టణాలకు చేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టే ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది.

ఈ ఏడాది రెండోసారి దాడి

జబల్‌ అల్‌-ఉకైదత్‌లో ఈ ఏడాది వైమానిక దాడి జరగడం ఇది రెండోసారి. గత జూన్‌లోనూ ఇదే ప్రాంతంలోని అక్రమ బంగారు తవ్వకాల గనిపై దాడి జరిగిన ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. ఆ సమయంలో తమ దేశ సరిహద్దుల్లో అక్రమ బంగారు తవ్వకాలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టినట్లు ఈజిప్ట్‌ సైన్యం ప్రకటించింది. 223 మందిని అదుపులోకి తీసుకుంది, వారిలో 136 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. అక్రమ బంగారు తవ్వకాలు, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించింది. తాజా దాడికి కూడా ఈజిప్ట్‌ వైమానిక దళమే కారణమని ‘ఎమర్జెన్సీ లాయర్స్‌’ ఆరోపించింది.

సూడాన్‌-ఈజిప్ట్‌ మధ్య సరిహద్దు వివాదం

సూడాన్‌, ఈజిప్ట్‌ మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న హలాయెబ్‌ ట్రయాంగిల్‌ ప్రాంతంపై ఇరు దేశాలు హక్కులు కోరుతున్నాయి. బంగారు గనులు ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా కీలకమైంది. తాజా దాడి సూడాన్‌ భూభాగంలో జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లోని బంగారం, ఇతర ఖనిజ సంపదపై నియంత్రణ సాధించేందుకు ఈజిప్ట్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

బంగారం కోసం ప్రాణాలకు తెగిస్తున్న కార్మికులు

ఎర్ర సముద్రం నుంచి లిబియా వరకు సుమారు 1,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈజిప్ట్‌-సూడాన్‌ సరిహద్దు ప్రాంతంలో బంగారం అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఈజిప్ట్‌ చర్యలు చేపడుతోంది.

సూడాన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా జీవనోపాధి కోల్పోయిన అనేకమంది ప్రమాదకరమైన బంగారు గనుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ గనుల ద్వారా లభించే బంగారం యుద్ధంలో పాల్గొంటున్న వర్గాలకు ఆర్థికంగా ఉపయోగపడుతోంది. దీంతో బంగారం తవ్వకాల ప్రాంతాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజా వైమానిక దాడి సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.

Follow Us
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్