AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో..

Killari Triveni: రాజాంకు చెందిన పదో తరగతి విద్యార్థిని కిల్లారి త్రివేణి పెంటాథ్లాన్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. దుబాయ్‌లో జరగనున్న ఈ పోటీలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. పేద కుటుంబం నుండి వచ్చిన త్రివేణికి సుమారు రెండు లక్షల రూపాయల సహాయం అవసరం. ఆమె కలను నెరవేర్చడానికి దాతలు, క్రీడాభిమానులు చేయూత అందించాలని విజ్ఞప్తి.

పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో..
Help Triveni Reach Dubai
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 11:35 AM

Share

Killari Triveni: ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదు.. ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందితే అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించగలరు. కానీ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే లక్ష్యం చేరుకోవడం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం రాజాం పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కిల్లారి త్రివేణి పరిస్థితి కూడా ఇదే. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఈ గ్రామీణ క్రీడాకారిణికి ఆర్థిక ఇబ్బందులు సవాల్‌గా మారాయి.

రాజాం పట్టణంలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న త్రివేణి స్వగ్రామం రేగిడి మండలంలోని బాలకవివలస. చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకున్న త్రివేణి క్రమంగా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ పోటీల్లో విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో రాజాంలో నిర్వహించిన జిల్లాస్థాయి లేజర్ రన్‌ (పెంటాథ్లాన్) పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. అనంతరం ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించింది. తాజాగా అక్టోబర్ నెల 4వ తేదీ నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించిన అండర్‌15 జాతీయస్థాయి పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఐదుగురు భారత క్రీడాకారుల్లో త్రివేణి చోటు దక్కించుకుంది. నవంబరు 9 నుంచి 15వ తేదీ వరకు దుబాయిలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఆమెకు లభించింది.

గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన ఓ విద్యార్థినికి ఇది ఎంతో కీలకమైన మైలురాయి. అయితే అంతర్జాతీయ వేదికపై దేశం తరఫున పోటీపడాలన్న త్రివేణి ఆశకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారుతున్నాయి. దుబాయికి వెళ్లి పోటీల్లో పాల్గొనడానికి సుమారు రెండు లక్షల వరకు ఖర్చవుతుందని పెంటాథ్లాన్ అసోసియేషన్ సమాచారం ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. త్రివేణి తండ్రి లక్ష్మణ.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా, తల్లి రోహిణి గృహిణి. రోజువారీ కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీరికి ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం భారంగా మారింది. అయినా కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని, సాధించిన విజయాలను చూసి ఆమె తల్లిదండ్రులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివేణి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం దాతల వైపు ఆశగా చూస్తున్నారు. మరోవైపు అక్టోబర్ నెల 20వ తేదీ వరకు అవసరమైన ఏర్పాట్ల కోసం సమయం ఉండటంతో సాయం అందితే తన కలను సాకారం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పెంటాథ్లాన్‌లో భాగమైన లేజర్ రన్‌ పోటీలు సాధారణ పరుగు పందేలకు భిన్నంగా ఉంటాయి. రెండు వేల మీటర్ల పరుగు విభాగంలో 400 మీటర్ల ట్రాక్‌పై ఐదు రౌండ్లు పరుగెత్తాలి. ప్రతి రౌండ్‌లో లేజర్ గన్‌తో లక్ష్యాన్ని ఛేదించిన తర్వాతే తదుపరి రౌండ్‌కు వెళ్లాలి. షూటింగ్‌కు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. పరుగులో వేగంతో పాటు షూటింగ్‌లో ఏకాగ్రత, కచ్చితత్వం కూడా విజయానికి కీలకం. ఈ రెండు నైపుణ్యాలను సమన్వయం చేసుకున్న క్రీడాకారులే మెరుగైన ఫలితాలు సాధించగలరు. త్రివేణికి షూటింగ్‌లో ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి శిక్షకుడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పెంటాథ్లాన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి కె.కె. చక్రధర్రావు తెలిపారు. అలాగే లేజర్ గన్‌ను సమకూర్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయస్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్న త్రివేణి ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పై భారతదేశం తరఫున పోటీపడేందుకు సిద్ధమవుతోంది. ప్రతిభ ఉంది, పట్టుదల ఉంది, లక్ష్యం చేరుకోవాలన్న తపన ఉంది. కావాల్సిందల్లా ఆర్థికంగా చేయూత. దాతలు, క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి సహకరిస్తే ఓ పేద కుటుంబానికి చెందిన బాలిక అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది. త్రివేణి ప్రయాణానికి అందే చేయూత.. ఆమె ఒక్కరి భవిష్యత్తుకే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మరెందరో క్రీడా ప్రతిభావంతులకు స్ఫూర్తిగా నిలవగలదు.

Follow Us
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్
గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్