AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma: హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డు

Abhishek Sharma: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌ లో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకే ఏడాదిలో అత్యధికంగా 69 సిక్సర్లు బాది సూర్యకుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేస్తూ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Abhishek Sharma: హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డు
Abhishek Sharma
Rakesh
|

Updated on: Oct 15, 2026 | 11:47 AM

Share

Abhishek Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ డాషింగ్ బ్యాటర్, ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన అభిషేక్, ఈ ఇన్నింగ్స్‌లో బాదిన ఒకే ఒక్క సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీని ద్వారా ఇంతకుముందు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఆయన బ్రేక్ చేశారు.

సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఏడాదిలో 68 సిక్సర్లతో సమంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ 2022 సంవత్సరంలో ఈ అద్భుతమైన ఫీట్ సాధించగా, ఇప్పుడు అభిషేక్ శర్మ 2026లో ఏకంగా 69 సిక్సర్లు బాది ఆ రికార్డును అధిగమించారు. గత ఏడాది కూడా అభిషేక్ 54 సార్లు బంతిని బౌండరీ అవతలకు పంపి తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ జాబితాలో మరో భారతీయ బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ 45 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరో అరుదైన ప్రపంచ రికార్డుకు చేరువలో అభిషేక్

కేవలం సిక్సర్ల మోత మోగించడమే కాకుండా, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు వైపు అభిషేక్ శర్మ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో 65 ఇన్నింగ్స్‌లాడిన ఆయన మొత్తం 142 సిక్సర్లు పూర్తి చేసుకున్నారు. కేవలం 8 సిక్సర్లు బాదితే ఆయన 150 సిక్సర్ల ప్రత్యేక క్లబ్‌లో చేరుతారు. ఫుల్ మెంబర్ దేశాల జాబితాలో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 86 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, అభిషేక్ కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసే సువర్ణావకాశం దక్కించుకున్నారు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు

అభిషేక్ శర్మ ఆడే దూకుడు శైలి ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారింది. క్రీజులో కాలు నిలదొక్కుకుంటే చాలు బౌలింగ్ దాడిని చిత్తు చేసే సత్తా ఆయన సొంతం. పవర్ ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడంతో పాటు భారీ సిక్సర్లు బాదడంలో ఆయన శైలి ప్రత్యేకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో భారత జట్టు తరఫున మరిన్ని చారిత్రక రికార్డులు సాధించడానికి ఈ యువ బ్యాటర్ సిద్ధమవుతున్నారని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిలిచిన ఎన్నికలు.. కారణం ఏంటంటే.
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
ఈ చిన్న టిప్ తో తలలో చుండ్రు వెంటనే మాయం!
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
విమానాల్లో ఈ పవర్ బ్యాంక్‌లు బంద్.. కేంద్రం బిగ్ డెసిషన్
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!