Viral Video: కారులో పసికందు ప్రాణాలు కాపాడిన డిటెక్టివ్.. NYPD అధికారిపై నెటిజన్ల ప్రశంసలు
యూఎస్‌లో జరిగిన ఒక హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) డిటెక్టివ్ రద్దీ సమయంలో పనికి వెళుతుండగా కారులో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న శిశువు ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల...

యూఎస్‌లో జరిగిన ఒక హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) డిటెక్టివ్ రద్దీ సమయంలో పనికి వెళుతుండగా కారులో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న శిశువు ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంది.
న్యూయార్క్‌లోని ఎమర్జెన్సీ షోల్డర్ లేన్‌లో వేగంగా వెళ్తున్న నల్లటి కారును డిటెక్టివ్ ఫస్ట్ గ్రేడ్ మైఖేల్ గ్రీనీ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు గమనించాడు. NYPD డిటెక్టివ్ తన కారు లైట్లను త్వరగా ఆన్ చేసి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వేగంగా వెళ్తున్న BMW కారును ఆపాడు. తన బిడ్డ ఉక్కిరిబిక్కిరి అవుతోందని గ్రీనీకి తండ్రి చెప్పాడు. ఆ వ్యక్తి అరుపు విన్న వెంటనే, NYPD డిటెక్టివ్ దూకి పిల్లవాడిని కారు నుండి బయటకు తీశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గ్రీనీ ఆ పాపను వీపుపై కొట్టి ఆమె గొంతు క్లియర్ చేస్తున్నట్లు, తద్వారా ఆమె మళ్ళీ ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నట్లు చూపిస్తుంది. తన కూతురు బాగానే ఉందని తండ్రి తరువాత పోలీసులకు చెప్పాడు. గ్రీనీ NYPDలో 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గ్రీనీ సమయస్ఫూర్తిని నెటిజన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
వీడియో చూడండి:
NEW: NYPD detective saves the life of a choking baby on his way to work in rush hour traffic.
Detective First Grade Michael Greaney was in traffic when he saw a black SUV speeding in the emergency shoulder lane.
Greaney turned on the lights of his unmarked car and… pic.twitter.com/A3nDAG1ToB
— Collin Rugg (@CollinRugg) December 11, 2025
