AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..

నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 4:57 PM

Share

నెలకు రూ. 8 వేలు సంపాదించే చిరుద్యోగి యశోదకు రూ. 13 కోట్ల జీఎస్టీ బకాయిల నోటీసు వచ్చి షాకిచ్చింది. కేటుగాళ్లు ఆమె పేరు, డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి నకిలీ కంపెనీని రిజిస్టర్ చేసి జీఎస్టీ ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అమాయకుల ఆధార్, వివరాలతో జరిగే ఈ మోసాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యాపారం ఉంటేనో లేక ఇండస్ట్రీ నడుపుతుంటేనో జీఎస్టీ నోటిసులు రావచ్చు. కానీ ఓ చిరుద్యోగి నెలకు రూ. 8 వేలు జీతం సంపాదించే ఓ మహిళకు ఏకంగా రూ. 13 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. తమిళనాడు వెల్లూరు జిల్లా గుడియాతంలో నివసించే యశోద స్థానికంగా ఓ షూ కంపెనీలో నెలకు రూ. 8 వేల జీతానికి పని చేస్తోంది. ఆమె భర్త మహాలింగం కార్ డ్రైవర్. ఇటీవల యశోద తన నెల జీతం డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లగా.. అకౌంట్‌ను అధికారులు ఫ్రీజ్ చేసినట్లు తెలుసుకుంది. ఖాతా ఎందుకు ఫ్రీజ్ చేశారని ఆరా తీయగా.. ఏకంగా రూ. 13 కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో దెబ్బకు షాక్‌ తింది యశోద. ఎవరో ఆమె పేరు, డాక్యుమెంట్స్ ఉపయోగించి ఫ్రాడ్ కంపెనీని రిజిస్టర్ చేసి జీఎస్టీ ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానించారు. చెన్నైలోని జీఎస్టీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. చెన్నై కార్యాలయానికి వెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితురాలు వాపోయింది. నెల జీతం డ్రా చేసుకునే ఛాన్స్ లేకపోవడంతో ఆందోళన పడింది. కేటుగాళ్లు అమాయకుల పేర్లు, ఆధార్ కార్డులు ఉపయోగించి నకిలీ కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని.. ఇలాంటి జీఎస్టీ మోసాలపై అధికారులు దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. యశోద సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..

యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్‌..

Hyderabad: హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్