Gold Price Today: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, డాలర్ బలహీనపడటంతో గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా కారణమవుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. నేటి హైదరాబాద్, ఢిల్లీ సహా పలు నగరాల్లోని బంగారం, వెండి తాజా ధరలను ఈ కథనంలో చూడండి.
బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం, వెండి ధరలకు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, డాలర్ బలహీనపడటం ప్రధాన కారణాలుగా మారాయి. మరొకవైపు ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం పెరగడానికి ద్రవ్యోల్బణం కారణం అని చెప్పవచ్చు. ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 15, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,34,730 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,23,500 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,13,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,880 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,650 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,730 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,500 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,930 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,600 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,730 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,23,500 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,730 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,23,490 వద్ద కొనసాగుతోంది. మరొకవైపు డిసెంబర్ 10న యూఎస్ ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లని 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది బంగారం ధరలు ఇంతలా పెరగడానికి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రధాన కారణంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు

