ఎన్ని చేసినా బరువు తగ్గని వారు ఇది ఒకసారి ట్రై చేయండి.. ఈజీగా స్లిమ్ అవుతారు..!
భారతదేశంలో లక్షలాది మంది నేడు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య ఊబకాయం. ఊబకాయం, బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందువల్ల దానిని నియంత్రించడం చాలా ముఖ్యం. చిన్న జీవనశైలి మార్పులు కూడా మీ ఫిట్‌నెస్ ప్రయాణానికి ఎంతో మేలు చేస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీకు ఎంతో ప్రభావంతంగా ఉండే అటువంటి పద్ధతిని మీకు చెప్పబోతున్నాం. దాంతో మీరు చౌవకైన పద్ధతిలో ఈజీగా బరువు తగ్గి స్లిమ్ అవుతారు..

ప్రతి ఒక్కరి వంటింట్లో ఈజీగా లభించే మెంతులు బరువు తగ్గడానికి, పొట్టను చదునుగా ఉంచడానికి సహాయపడతాయి. మెంతిగింజలలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండిన అనునభూతిని కలిగిస్తుంది. తరచూగా ఏదైనా తినాలనే ఆకలి బాధలను నివారిస్తుంది. ఫైబర్‌తో పాటు మెంతి గింజలలో రాగి, రిబోఫ్లేవిన్, విటమిన్లు ఏ,బీ6, సీ, కే. కాల్షియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈజీగా బరువు తగ్గడానికి మెంతి గింజలను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
వేడి నీటిలో మెంతులు నానబెట్టి.. క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్లు లేదా రాప్స్లో చేర్చవచ్చు. ఇది పోషకమైన, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు, బరువు నిర్వహణకు సహాయపడుతుంది. మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెంతి పొడిని పసుపుతో కలిపి మసాలాగా వాడండి. పసుపులోని శోథ నిరోధక ప్రభావాలు, మెంతి కలిసి జీర్ణ, జీవక్రియ ప్రయోజనాలకు హెల్ప్ చేస్తాయి. భోజనం, పెరుగు లేదా స్మూతీలలో మెంతి పొడిని కలపండి. ఇది అదనపు పీచు పదార్థాన్ని అందిస్తుంది. సంతృప్తిని పెంచుతుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతి గింజలు, కూరగాయలు, తేలికపాటి మసాలా దినుసులతో తయారు చేసిన తేలికపాటి సూప్.. తక్కువ కేలరీలతో కడుపు నిండేలా చేస్తుంది.
మెంతి గింజలను గ్రీన్ టీతో కలిపితే జీవక్రియకు అనుకూలమైన పానీయం తయారవుతుంది. ఇది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతి పొడిని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమం జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మెంతి పొడిని నిమ్మరసం, నీటితో కలిపి కలిపి తీసుకుంటే.. ఇది శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. మీకు రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








