AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ కార్డ్ Vs గోల్డెన్ వీసా.. తేడా ఏమిటి? ఏది బెటర్?

గోల్డ్ కార్డ్ Vs గోల్డెన్ వీసా.. తేడా ఏమిటి? ఏది బెటర్?

Phani CH
|

Updated on: Dec 15, 2025 | 4:08 PM

Share

అమెరికాలో ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్, సంపన్నుల అమెరికా కలను సాకారం చేస్తుంది. 1 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నివాసం, పని చేసే హక్కులు, పౌరసత్వ మార్గం లభిస్తాయి. గ్రీన్ కార్డ్ కంటే బలమైనదని ట్రంప్ తెలిపారు. పెట్టుబడులు, ప్రతిభను ఆకర్షించడం లక్ష్యం. దరఖాస్తు ప్రక్రియ, ఇతర దేశాల గోల్డెన్ వీసా వివరాలు ఇక్కడ చూడండి.

అమెరికాలో సెటిల్ అవ్వాలనేది చాలా దేశాల్లో ఉన్నవారి కల. కానీ ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడయ్యాక సీన్ మారుతోంది. విద్యార్థులు, వ్యాపారులు.. ఇతర వర్గాల వారు అమెరికా కలకు అడ్డుగోడలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్.. వారి ఆశలను నెరవేరుస్తుందా? ఆల్రెడీ వీటి సేల్స్ కూడా ప్రారంభమైంది. మరి దీని అమ్మకాలు ఎలా ఉంటాయి? అసలు దీని ధర ఎంత.. ఎలా దీనికి అప్లయ్ చేసుకోవాలి? ఇలాంటి గోల్డ్ కార్డ్స్ లేదా గోల్డెన్ వీసాలను ఇంకా ఏఏ దేశాలు జారీ చేస్తున్నాయి? వాటి ధర ఎంత ఉంటుంది? వాటి వల్ల బెనిఫిట్స్ ఏమిటి? వాటిని ఆయా దేశాలు ఎప్పుడైనా రద్దు చేయచ్చా? అమెరికా సిటిజన్ షిప్ కావాలనుకుంటే.. వాళ్లకు ఈ గోల్డ్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది సంపన్నులకే అని చెప్పాలి. ఎందుకంటే దీనిని సొంతం చేసుకోవడానికి వన్ మిలియన్ డాలర్లను చెల్లించాలి. వన్ మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయిలు. సో.. ఇది చెల్లిస్తే.. అప్పుడు గోల్డ్ కార్డ్ మీదవుతుంది. ఇది ఉంటే.. అమెరికాలో ఎంచక్కా ఉండొచ్చు అని అగ్రరాజ్యం చెబుతోంది. ఇప్పుడు ఓ సెపరేట్ వెబ్ సైట్ పెట్టి దీనిని సేల్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సదుపాయం గతంలో EB-5 ప్రోగ్రామ్ రూపంలో ఉండేది. దానిని 1990లో తీసుకువచ్చారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దాని ఉద్దేశం. కాకపోతే ఇందులో అవకతవకలు జరుగుతుండడంతో.. దాని ప్లేసులో గోల్డ్ కార్డ్ ను ప్రారంభించారు. నిజానికి ఈ కార్డు విధానంపై అమెరికా ప్రెసిడెంట్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. తమ స్వదేశాలకు వెళ్లిపోతున్న ప్రతిభావంతులు.. ఇప్పుడీ కార్డు తీసుకుని అమెరికాలోనే ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ కంపెనీలు.. టాలెంట్ ఉన్న ఉద్యోగులను అమెరికాలోనే ఉంచాలనుకుంటే మాత్రం.. వారికి 2 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 18 కోట్ల రూపాయిలు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. అందుకే వ్యాపారవేత్తల నుంచి ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. పైగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ గురించీ చెప్పుకొచ్చారు. వీసాల విషయంలో ఇలాంటి విధానాల వల్ల సంస్థలు.. టాలెంట్ ఉన్న ఎంప్లాయిస్ ను కోల్పోవాల్సి రావచ్చని చెప్పారన్నారు. కానీ ట్రంప్ టార్గెట్ వేరే. ఈ గోల్డ్ కార్డ్ ప్రోగ్రాంతో అమెరికాకు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. అందుకే దీనిని పట్టుబట్టి మరీ అమలు చేస్తున్నారు. అయినా అమెరికాలో ఇప్పటికే గ్రీన్ కార్డ్ ఉంది కదా.. మరి ఇప్పుడీ గోల్డ్ కార్డుతో ఏమిటి లాభం అని కొంతమందికి అనిపించవచ్చు. మరి, గోల్డ్ కార్డ్ కు, గ్రీన్ కార్డ్ కు ఉన్న తేడా ఏమిటి? నిజానికి గోల్డ్ కార్డ్ కూడా గ్రీన్ కార్డు లాంటిదే. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది. బేసిక్ గా చూస్తే.. ఇది గ్రీన్ కార్డులానే పనిచేస్తుంది. కాకపోతే అంతకన్నా బెటర్, దాని కన్నా స్ట్రాంగ్, పవర్ ఫుల్ అని ట్రంపే చెప్పారు. గ్రీన్ కార్డ్ కు ఉన్న ప్రివిలేజెస్ అన్నీ గోల్డ్ కార్డుకూ ఉంటాయి. అలా అని దీనిని H-1B వీసాలా భావించకూడదని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కార్డు గురించి ఇంకొంచెం డీటైల్డ్ గా చూస్తే.. ఇదొక పర్మినెంట్ రెసిడెంట్ కార్డు. ఈ కార్డు ఉంటే అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చు.. పని చేసుకోవచ్చు. ఈ కార్డుతో మరో ప్రయోజనం ఏంటంటే.. ఇతరుల్లా ఎలాంటి స్క్రూటినీని ఫేస్ చేయకుండా.. అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్లచ్చు. రావచ్చు. తరువాత నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొన్ని చెకింగ్స్ తప్పకపోవచ్చు. కాకపోతే గ్రీన్ కార్డు ఉన్నవారికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్, కాలేజ్ ఫైనాన్షియల్ ఎయిడ్, మిలటరీ సర్వీస్.. ఇవన్నీ లభిస్తాయి. ఇక గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు ఐదేళ్లపాటు అమెరికాలోనే నివాసం ఉన్నవాళ్లు అక్కడి పౌరసత్వానికి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. లేదా.. అమెరికా సిటిజన్ ను పెళ్లి చేసుకుని 913 రోజుల పాటు అక్కడే ఉన్నా సిటిజన్ షిప్ కు అప్లయ్ చేసుకోవచ్చు. సో.. గ్రీన్ కార్డుకు మించిన బెనిఫిట్స్ గోల్డ్ కార్డుకు ఉంటాయని చెప్పడం.. తరువాత ప్లాటినం కార్డు హామీ కూడా ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ దీనిపై పడింది. ఇక గోల్డ్ కార్డుకు ఎలా అప్లయ్ చేయాలి అంటే.. trumpcard.gov అనే వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ కనిపించే ఆప్షన్స్ లో కార్పొరేట్ గోల్డ్ కార్డ్ లేదా గోల్డ్ కార్డ్ లేదా ప్లాటినం వెయిట్ లిస్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. పర్సనల్ డీటైల్స్ ను నింపాలి. myUSCIS.gov అకౌంట్ ను క్రియేట్‌ చేసి నాన్ రిఫండబుల్ ఫీజను పే చేయాలి. పర్సనల్ అప్లికేషన్ అయితే వన్ మిలియన్ డాలర్లను, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ కావాలంటే.. 2 మిలియన్ డాలర్లను పే చేయాలి. వెరిఫికేషన్ అయ్యాక అమౌంట్ చెల్లించాలి. అక్కడ సూచించిన మార్గాల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. మరి ఈ గోల్డ్ కార్డ్ ను ఎవరికైనా ఇచ్చేస్తారా అంటే.. దానికీ కొన్ని రూల్స్ ఉంటాయి. అమెరికాలో లీగల్ గా నివసించడానికి కావలసిన అర్హతలు ఉండాలి. అంతకన్నా ముందు అమెరికాలో ప్రవేశించడానికి పర్మిషన్ ఉండాలి. వీసా నెంబర్ ఉండాలి. ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించాక.. డీటైల్స్ చెక్ చేస్తారు. బ్యాక్ గ్రౌండ్ తనిఖీ చేస్తారు. తరువాత వీసా ఇంటర్వ్యూను ఫేస్ చేయాలి. ఇవన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వీటి తరువాత.. గోల్డ్ కార్డ్ వస్తే.. అమెరికాలో పౌరులకు ఎలాంటి పన్నులు ఉంటాయో.. వీరికీ అవి వర్తిస్తాయి. మరి గోల్డ్ కార్డ్ వచ్చాక అది రద్దయ్యే ఛాన్సుందా? కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో అంటే.. సదరు వ్యక్తి నేరారోపణలు ఎదుర్కొన్నా.. జాతీయ భద్రతా సమస్యలు తలెత్తినా.. అమెరికాలో ఎలా అయితే వీసాను రద్దు చేస్తారో.. అలాగే గోల్డ్ కార్డును కూడా రద్దు చేయచ్చు. అమెరికా లానే.. ఏఏ దేశాలు ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నాయి? ఈ లిస్టులో చాలా దేశాలే ఉన్నాయి. స్పెయిన్, యునైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా, గ్రీస్, కెనడా, మాల్టా, ఇటలీ, సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, యూఏఈ, టర్కీ.. ఈ లిస్టులో ఈ దేశాలన్నీ ఉన్నాయి. ఇవి జారీ చేసే గోల్డెన్ వీసాలన్నింటికీ ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ను పాటించి ఆ వీసాలను పొందవచ్చు. సో.. తమ దేశంలోకి టాలెంటెడ్ పీపుల్ తో పాటు.. పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి వివిధ దేశాలు ఇప్పుడీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరి ఈ పోటీలో.. అమెరికా గోల్డ్ కార్డ్ ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

పదేళ్ల రికార్డ్‌ బ్రేక్‌… మరో మూడు రోజులు బీ అలర్ట్‌

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే