ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో మనోళ్లకు ఉద్యోగాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'గోల్డ్ కార్డ్' పేరుతో కొత్త వీసా విధానాన్ని ప్రకటించారు. దీని ద్వారా USలోని టాప్ యూనివర్సిటీల నుండి గ్రాడ్యుయేట్ అయిన భారతీయ, చైనీస్ విద్యార్థులు దేశంలోనే పనిచేయవచ్చు. అయితే, విద్యార్థులు $1 మిలియన్, కంపెనీలు $2 మిలియన్ చెల్లించాలి. ఇది USకు బిలియన్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది, అర్హత గల వారికి 5 ఏళ్ల తర్వాత పౌరసత్వం లభిస్తుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థులను.. తమ దేశంలోనే ఉంచడానికి వీలుగా ట్రంప్ గోల్డ్ కార్డ్ ను ప్రకటించారు. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న భారతీయ, చైనీస్ విద్యార్థులను అక్కడే పనిచేసేలా కొత్త వీసా విధానాన్ని ప్రకటించారు. అమెరికాలో చదువుకుని తిరిగి తమ దేశాలకు వెళ్లాల్సి వస్తుండడం అవమానకరమని ట్రంప్ అన్నారు. టాప్ యూనివర్సిటీల నుంచి బయటికి వచ్చిన స్టూడెంట్స్‌ను కంపెనీలు నియమించుకోవచ్చని.. అయితే అందుకు ఈ గోల్డ్ కార్డు కోసం ఆ స్టూడెంట్స్, కంపెనీలు కొంత డబ్బు చెల్లించాలని తెలిపారు. కంపెనీలు నైపుణ్యం గల మానవ వనరులను తీసుకోవడం వల్ల వాటికి స్థిరత్వం వస్తుందని.. దాని వల్ల నైపుణ్యం కలిగిన విద్యార్థులు అమెరికాలోనే ఉంచే వీలు ఉంటుందని ట్రంప్ అన్నారు. అయితే ఈ గోల్డ్ కార్డ్ ను పొందేందుకు వ్యక్తిగతంగా స్టూడెంట్స్ 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.9 కోట్లు చెల్లించాలని తెలిపారు. ఇక వారిని నియమించుకునే కార్పొరేట్ సంస్థలు 2 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆదాయం రావడంతోపాటు.. అర్హత కలిగిన ఉద్యోగులు 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది.. మ్యాటర్ ఏంటంటే..
Gold Price Today: ద్రవ్యోల్బణం ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్కు బీచ్ వచ్చేస్తోందోచ్
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు

