గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాను గ్రీన్ టీని రోజూ తాగుతున్నారు
TV9 Telugu
గ్రీన్ టీని రోజూ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు
TV9 Telugu
రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీని తాగితే మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి
TV9 Telugu
అయితే గ్రీన్ టీ ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే తీవ్ర దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీని అధికంగా సేవిస్తే మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుండా అడ్డుకుంటుంది
TV9 Telugu
ఫలితంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. అలాగే భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ అసలు తాగకూడదు. కనీసం 2 గంటల విరామం ఇచ్చి ఆ తరువాతే గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది
TV9 Telugu
అలాగే ఈ టీని అతిగా తాగితే గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ టీని మోతాదుకు మించి తాగకూడదు
TV9 Telugu
గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగానే ఉంటుంది. కాఫీ, టీ లకన్నా కెఫీన్ ఇందులో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గ్రీన్ టీని అతిగా సేవిస్తే శరీరంలో కెఫీన్ అధికంగా చేరే ప్రమాదం ఉంటుంది
TV9 Telugu
గ్రీన్ టీని మోతాదులో తాగితే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. కానీ మోతాదుకు మించి తాగితే తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. కనుక తలనొప్పి ఉన్నవారు గ్రీన్ టీని సేవిస్తుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది