AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..? అసలు నిజాలు తెలుసుకోండి..

Country Chicken vs Broiler Chicken: మాంసాహార ప్రియులకు బ్రాయిలర్, నాటు కోడి మాంసం రెండూ ఇష్టమే. అయితే బ్రాయిలర్ కోళ్లను కృత్రిమంగా పెంచడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాటు కోడిలో కొవ్వు తక్కువ, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..? అసలు నిజాలు తెలుసుకోండి..
Country Chicken Vs Broiler Chicken
Krishna S
|

Updated on: Dec 15, 2025 | 2:53 PM

Share

నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే మస్త్ ఇష్టం. ప్రతిరోజూ తినమన్నా తింటారు. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్ వంటి రకరకాల వంటకాలతో ఆనందిస్తారు. కొంతమంది తక్కువ ధరకే లభించే బ్రాయిలర్ చికెన్‌ను ఎక్కువగా వినియోగిస్తుండగా.. మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా పెంచే నాటు కోడి మాంసం తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది..? దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బ్రాయిలర్ చికెన్ ఆరోగ్య నష్టాలు

బ్రాయిలర్ కోళ్లు తక్కువ ధరకే లభిస్తాయి. కానీ వాటిని కృత్రిమంగా పెంచుతారు. వాటి సంతానోత్పత్తి సమయంలో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ విరివిగా వాడతారు. అందువల్ల వీటిని అధికంగా తీసుకునే వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్, రోగనిరోధక లోపం, హార్మోన్ల అసమతుల్యత, బ్యాక్టీరియా అసమతుల్యత వంటి అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కోళ్లలో పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

బ్రాయిలర్ vs. దేశీ చికెన్

పోషకాలు, కొవ్వు పరంగా బ్రాయిలర్ కోడి కంటే నాటు కోడి చాలా ఆరోగ్యకరమైనది. ఉదాహరణకు.. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో 130 నుండి 150 కేలరీలు ఉంటే, 100 గ్రాముల దేశీ చికెన్‌లో సుమారు 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు శాతం పరంగా చూస్తే.. బ్రాయిలర్ చికెన్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కానీ కంట్రీ చికెన్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. గుడ్లు పెట్టే కోళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బ్రాయిలర్ కోళ్లలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. నిస్సందేహంగా దేశీ కోడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నాటుకోడి ప్రయోజనాలు

నాటు కోడి మాంసంలో ప్రోటీన్, విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, రోగనిరోధక శక్తి జీవక్రియను బలోపేతం చేస్తాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వలన బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. సరైన పద్ధతిలో వండుకుని తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి