అర్ధరాత్రి బెంగళూరులో రాపిడో ఆటో ఎక్కిన ఓ యువతి భయాన్ని డ్రైవర్ వెనుక ఉన్న కొటేషన్ దూరం చేసింది. "నేను మీ తండ్రి లాంటి వాడినే, మీ సోదరుడి లాంటి వాడిని. మీ భద్రతే ముఖ్యం" అనే సందేశం ఆమెకు భరోసా ఇచ్చింది. ఈ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోగా, అది వైరల్ అయ్యింది. బెంగళూరు భద్రతపై చర్చకు దారితీసింది.