- Telugu News Photo Gallery Spiritual photos If you have these items in your house, any Vastu defect will disappear.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం..
ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. తల్లి కృప కోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఇవన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఉండదు. డబ్బుల సమస్య వేధిస్తూనే ఉంటుంది. దీనికి వాస్తు దోషం కారణం కావొచ్చు. ఇవి పాటించినట్లయితే వాస్తు దోషం తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. మరి ఆ వాస్తు నియమాలు ఏంటి.? ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Updated on: Dec 15, 2025 | 1:40 PM

ఇల్లు కట్టడం ముఖ్యం కాదు.. దానిని వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేది ముఖ్యం. ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో వెండి వేణువును ఉంచాలి.

వాస్తు ప్రకారం ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో అందరు చూడగలిగే విధంగా ఉంచాలి. గణపతి విఘ్నధిపతి కాబట్టి ఇంట్లో సమస్యలను రాకుండా చేస్తాడని పండితులు అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అయితే వీటిని ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఫలితాలు ఉంటాయి. లేదంటే ఆర్థిక సమస్యలు తగ్గవు.

వాస్తు శాస్త్రం ప్రకారం శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోషం తొలగిపోతుంది. దీంతో ఆర్థికంగా బలపడతారు. ఇంట్లో సమస్యలన్నీ దూరం అవుతాయి. ఎప్పుడు సంతోషంగా జీవిస్తారు. ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.

మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో కొబ్బరికాయ ఉంటే లక్ష్మిమాత అనుగ్రహం ఉంటుందని నమ్మకం. అందుకే మీ ఇంట్లో ఎప్పుడు కూడా కనీసం ఒక్క కొబ్బరికాయ అయినా ఉండేలా చూసుకోండి. లేదంటే వెంటనే కొని తెచ్చుకోవాలి. లేదా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉన్న మంచిదే.




