ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నువ్వుల్లో దండిగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో తేనెతో నువ్వులను కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం.. తేనె, నువ్వుల మిశ్రమం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. వీటిని రోజూ ఉదయం పరగడుపునే తింటే అనేక ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి
TV9 Telugu
తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం వృద్ధి చెందుతుంది
TV9 Telugu
కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు
TV9 Telugu
నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. అలాగే ఈ మిశ్రమంలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే పోషణ సరిగ్గా అందుతుంది. మెదడు యాక్టివ్‌గా మారి చదువుల్లో రాణిస్తారు
TV9 Telugu
తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి
TV9 Telugu
శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు
TV9 Telugu
ఈ మిశ్రమాన్ని తినడం వల్ల మహిళలకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది