Room Heater: చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
మూసివేసిన గదిలో హీటర్ ఎక్కువసేపు వాడటం వల్ల ఆక్సిజన్ తగ్గి, కార్బన్ మోనాక్సైడ్ పెరిగి ప్రాణాంతకం కావచ్చు. వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. నిద్రపోయే ముందు హీటర్‌ను ఆపివేయడం, మంచం, కర్టెన్ల నుండి దూరంగా ఉంచడం ముఖ్యం. ఎక్స్‌టెన్షన్ కార్డ్‌లు వాడకండి. పిల్లలు, వృద్ధుల వద్ద జాగ్రత్త. సురక్షితమైన హీటర్లైన ఆయిల్, సిరామిక్ వాడండి. క్రమం తప్పకుండా సర్వీస్ చేయండి.

చలి పులి చంపేస్తోంది. తీవ్రమైన చలికారంగా ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఉదయం తెల్లవారి 8, 9 దాటినా కూడా చలి తీవ్రత తగ్గటం లేదు. ఇక సాయంత్రం 5కూడా కాకముందే.. చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చలికాలంలో గదిని వెచ్చగా ఉంచడానికి చాలామంది రూమ హీటర్లను ఉపయోగిస్తుంటారు. కానీ, ఇలాంటి రూమ్ హీటర్లు ఎంత ఉపశమనం కలిగిస్తాయో.. అదే స్థాయిలో ప్రమాదానికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. రూమ్ హీటర్లను వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. లేదంటే..
మూసివేసిన గదిలో ఎక్కువసేపు హీటర్ రన్ అయితే ఆక్సిజన్ తగ్గిపోతుంది. కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది. దీని వల్ల నిద్రపోతున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. హీటర్ ఉన్న గదిలో కొంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. దీంతో తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది. హీటర్‌ను మంచం లేదా కర్టెన్ల దగ్గర ఉంచొద్దు. నేలపై, స్థిరమైన ప్రదేశంలో మండే వస్తువులకు దూరంగా ఉంచండి.
రాత్రిపూట రూమ్ హీటర్‌ను కంటిన్యూగా ఆన్‌లో ఉంచడం సురక్షితం కాదు. గదిలో అధిక తేమ లేదా తక్కువ ఆక్సిజన్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పడుకునే ముందు గదిని వేడి చేసి, హీటర్‌ను ఆపివేయడం మంచి విధానం. హీటర్ కోసం ఎక్స్‌టెన్షన్ కార్డ్‌ను ఉపయోగించకపోవడం మంచిది.
ఒక్కోసారి ఓవర్‌లోడింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. పిల్లలు , వృద్ధులకు దగ్గర హీటర్ ఉంచొద్దు. ఆయిల్ హీటర్లు లేదా సిరామిక్ హీటర్లు సురక్షితమైనవి. హీటర్‌ను క్రమం తప్పకుండా సర్వీస్ చేయడం కూడా అంతే ముఖ్యం. దుమ్ము పేరుకుపోయి హీటింగ్ ఎలిమెంట్ దెబ్బతిని పొగ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఉపయోగించే ముందు హీటర్‌ను శుభ్రం చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








