మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే.. ఇక క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్.. పూర్తీ వివరాలు
ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వగానే, సమీపంలోని నెట్వర్క్ గ్యారేజీ వివరాలను కస్టమర్ సపోర్ట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిస్తారు. వాహనాన్ని ఆ గ్యారేజీకి తీసుకెళ్లిన తర్వాత క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. మిగతా ప్రక్రియంతా బీమా కంపెనీ, గ్యారేజీ మధ్యనే జరుగుతుంది.

ఆరోగ్య బీమా మనిషికి ఆర్థిక భద్రత ఎలా అందిస్తుందో, అదే విధంగా వాహన బీమా ప్రమాదాల సమయంలో కార్లకు రక్షణగా నిలుస్తుంది. రోడ్డు ప్రమాదాలు, సహజ విపత్తులు, మానవ తప్పిదాల వల్ల వాహనాలకు నష్టం కలిగినప్పుడు కార్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. గత కొన్నేళ్లలో మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ విధానం. క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా వాహన యజమానులు జేబు నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కారును రిపేర్ చేయించుకునే అవకాశం లభిస్తుంది. బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న నెట్వర్క్ గ్యారేజీల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. రిపేర్ ఖర్చును బీమా కంపెనీ నేరుగా గ్యారేజీకి చెల్లిస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వగానే, సమీపంలోని నెట్వర్క్ గ్యారేజీ వివరాలను కస్టమర్ సపోర్ట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిస్తారు. వాహనాన్ని ఆ గ్యారేజీకి తీసుకెళ్లిన తర్వాత క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. మిగతా ప్రక్రియంతా బీమా కంపెనీ, గ్యారేజీ మధ్యనే జరుగుతుంది. ఈ విధానంలో క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుంది. పేపర్‌వర్క్ తక్కువగా ఉండటం, ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పారదర్శకత ఉండటం వల్ల కస్టమర్లకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. చెల్లింపుల విషయంలో గందరగోళం లేకుండా మొత్తం వ్యవహారం సాఫీగా సాగుతుంది.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, నెట్వర్క్ గ్యారేజీలు బీమా ఉన్న వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. చెల్లింపులు బీమా కంపెనీల నుంచే వస్తుండటంతో గ్యారేజీలకూ ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అందువల్ల రిపేర్ పనులు ఆలస్యం కాకుండా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ వల్ల వాహన యజమానిపై ఉండే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ప్రమాదం తర్వాత డబ్బుల కోసం ఆందోళన పడకుండా, కారు రిపేర్‌పై మాత్రమే దృష్టి పెట్టే వెసులుబాటు లభిస్తుంది. అందుకే నేటి రోజుల్లో ఎక్కువ మంది వాహన యజమానులు ఈ విధమైన ఇన్సూరెన్స్ పాలసీలను ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








