Cockroaches: బొద్దింకలతో జర భద్రం..! లైట్ తీసుకున్నారంటే.. భయంకరమైన రోగాలకు స్వాగతం పలికినట్టే..
బాబోయ్ బొద్దింకలు..చూసేందుకు చిన్నగానే ఉంటాయి. కానీ, అవి పెట్టే చిరాకు మాత్రం మామూలుగా ఉండదు..ముఖ్యంగా వంటింట్లో బొద్దింకలు కనిపిస్తే.. చాలా మంది తినడం కూడా మానేస్తుంటారు.. అంతలా చిరాకు పెడుతుంటాయి. ఒక్క బొద్దింక ఇంట్లో చేరితే వందల కొద్దీ పుట్టుకొస్తాయి. రాత్రి పూట వంటగదిలో ఎక్కువగా తిరుగుతుంటాయి.. ఎంత తరిమి కొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే, బొద్దింకలే కదా అని ఊరుకుంటే తీవ్ర వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం..

బొద్దింకలు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మూలం. వాటి విసర్జక పదార్థాలు, చర్మపు పొట్టు గాలిలో కలిసి అలెర్జీలు, ఆస్తమాను కలిగిస్తాయి. అవి ఆహారాన్ని కలుషితం చేసి ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, కలరా, విరేచనాలు, స్టమక్ ఫ్లూ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో పాటు నులిపురుగులకు కూడా కారణమవుతాయి. మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి వీటిని నియంత్రించడం ముఖ్యం.
బొద్దికంలు విబ్రియో కలరే అనే బ్యాక్టీరియాను సైతం వ్యాప్తి చేస్తాయి. దీని వల్ల కలరా వస్తుంది. డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. స్టమక్ ఫ్లూబొద్దికంల వల్ల స్టమక్ ఫ్లూ కూడా వస్తుంది. దీని వల్ల కడుపు, పేగుల్లో వాపు వస్తుంది. వాంతులు, విరేచనాలు దీని లక్షణాలు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. బొద్దంకలు కొన్ని సార్లు UTIకి కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా వ్యాప్తి చేస్తాయి. నులిపురుగులుబొద్దింకలు కొన్ని రకాల పరాన్నజీవుల గుడ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా నులిపురుగుల గుడ్లను వ్యాప్తి చేస్తాయి.
బొద్దింకలు సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. దీని వల్ల టైఫాయిడ్ వస్తుంది. బొద్దింకలు ఈ. కోలి అనే బ్యాక్టీరియాను వ్యాప్తి చెందిస్తాయి. ఇది విరేచనాలకు కారణం అవుతుంది. కొన్ని సార్లు రక్తవిరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. బొద్దింకల విసర్జక పదార్థాలు గాలిలో చేరి అలెర్జీలకు కారకాలుగా మారుతాయి. బొద్దింకల మలినాలు చేరిన గాలిని పీల్చడం, ఆ పరిసరాల్లో ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
బొద్దింకల పొట్టు కలిసిన గాలిని పీల్చడం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్బొద్దింకలు ఆహారపదార్థాలను కలుషితం చేస్తాయి. బొద్దింకలు అనేక బ్యాక్టీరియాలను ఆహారం మీదకు తీసుకువస్తాయి. ఈ ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








