ఇవి కేరళలో మాత్రమే కనిపిస్తాయి.. వరల్డ్ మొత్తంలో నో ఛాన్స్.. 

Prudvi Battula 

Images: Pinterest

15 December 2025

కేరళలోని అడవి మధ్యలో చెట్టు ఇంట్లో బస చేయడం మరపురాని అనుభవం అవుతుంది. ఈ టార్జాన్ అనుభవం వయనాడ్‌లో సాధ్యమే.

చెట్టు ఇంట్లో బస చేయడం

మీరు ఓనం సాధ్య విందును కనీసం ఒక్కసారైనా ప్రయత్నించాలి. అరటి ఆకులపై 20 కి పైగా వంటకాలు వడ్డిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది.

సాధ్య ఫుడ్

ఆ పడవలు పొడవాటి పాములలా కనిపిస్తున్నాయి. ఓనం సమయంలో మీరు ఈ పడవ ప్రయాణాన్ని చూడవచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది.

పాము పడవ ప్రయాణం

భారతదేశంలోనే అతి పొడవైన జిప్‌లైన్ మున్నార్‌లో ఉంది. మీరు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పచ్చని ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

పొడవైన జిప్‌లైన్

కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రసిద్ధి చెందింది. పంచకర్మ, అభియంకం వంటి సాంప్రదాయ చికిత్సలు అనేక వ్యాధులను నయం చేస్తాయి.

ఆయుర్వేద చికిత్స

కథకళి, తెయ్యం వంటి సాంప్రదాయ నృత్య సంస్కృతులను కేరళలో చూడవచ్చు. వీటికి దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది.

సాంప్రదాయ నృత్యం

అలప్పుజ హౌస్ బోట్ ఒక గొప్ప అనుభవం. దీనిలో ప్రయాణం రాత్రిపూట చేస్తే నీటిపై తేలుతూ నక్షత్రాలను ఆస్వాదించవచ్చు.

హౌస్ బోట్

మీరు కేరళ పర్యటనకు వెళ్లారంటే.. తెక్కడిలోని దట్టమైన అడవి మధ్య ఏనుగు సఫారీకి వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది.

అడవిలో ఏనుగు సఫారీ