ఒడియవ్వా బంటీ..! ఈ ఇద్దరూ ఒక్కరేనా..!! ఈ భామ బయట గత్తరలేపిందిగా
హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు ఓవర్ నైట్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ లోనూ అలరిస్తున్నారు .

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది. హీరోలకు సమానంగా హీరోయిన్స్ కూడా అద్భుతంగా నటించి మెప్పిస్తున్నారు. అలాగే హీరోలతో పోటీపడుతూ హీరోయిన్స్ కూడా సమానంగా నటిస్తూ.. పాత్రలకు ప్రాధాన్యత ఉండే సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్నారు. యాక్షన్ సీన్స్ తో పాటు, ఛాలెంజింగ్ రోల్స్ లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది డీ గ్లామర్ లుక్ లోనూ నటించాడని రెడీ అవుతున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్.. నటనపై ఉన్న ఆసక్తితో వారు ఎంచుకున్న రంగాల నుంచి తప్పుకొని సినిమాల్లోకి వస్తున్నారు. అలా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పోయిన కనిపిస్తున్న నటి కూడా అలా వచ్చినవారే.. ఆమె ఊహించని విధంగా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. పెద్ద హీరోయిన్ కాకపోయినా.. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే సినీ ఇండస్ట్రీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఒకప్పుడు టైక్వాండో ఛాంపియన్ ఆమె ఇప్పుడు నటిగా రాణిస్తుంది. ఆమె ఎవరో కాదు నిమిషా సజయన్. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. నిమిషా సజయన్ 1997 జనవరి 4న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి సజయన్ (ఇంజనీర్), తల్లి బిందు సజయన్. కేరళ మూలాలు ఉన్న మలయాళీ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఒక అక్క నీతు ఉంది. 2017లో దిలీష్ పోతన్ దర్శకత్వంలో వచ్చిన తొండిముత్యాలు దృక్సాక్షియుం అనే సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.
ఈడా (2018), ఒరు కుప్రసిద్ధ పయ్యన్ (2018), చోళ (2019) చిత్రాల్లో నటించి, 2018 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచింది. 2021లో ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రంలో నటనకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుంది. అలాగే నయట్టు, మాలిక్, చిత్తా( తమిళ్ మూవీ), DNA( తెలుగులో మై బేబీ), అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది. పోచర్, డబ్బా కార్టెల్ లాంటి సిరీస్ ల్లోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో డీగ్లామర్ లుక్స్ లో మెరిసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




