13 December 2025

20 ఏళ్లుగా సినిమాల్లో హీరోయిన్.. ఇప్పటికీ స్టార్ డమ్ రాలేదు..

Rajitha Chanti

Pic credit - Instagram

సినిమా ప్రపంచంలో నటిగా గుర్తింపు రావడం అంత సులభమేమి కాదు. కానీ వరుస అవకాశాలు వచ్చినా స్టార్ డమ్ రాని హీరోయిన్ ఎవరో తెలుసా.. 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్ రాలేదు. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రెజీనా కాసాండ్రా. చెన్నైలో జన్మించిన ఈ అమ్మడు సైకాలజీలో పీజీ పూర్తి చేసింది. 

తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 2005లో తమిళ చిత్రం 'కంద నాల్ ముఖల్'తో తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత 2012లో శివ మనసులో శృతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. 

తెలుగులో దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించిన రెజీనా.. ఇప్పటి వరకు సరైన స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. 

20 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్న రెజీనాకు 'స్టార్' నటిగా గుర్తింపు రాలేదు. ఇప్పటికీ విభిన్న చిత్రాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న రెజీనా.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.