థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. మూడు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఇక ఇప్పుడు అఖండ సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అఖండ తాండవం టైటిల్ తో విడుదలైన ఈ సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకుంది.
ప్రీమియర్స్ తో కలిపి ఈ మూవీ రూ.59.5 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిరోజు ఈ స్థాయిలో వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదేనని తెలిపింది.ఇక ఈ సినిమా రెండో రోజు రూ. 15 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజులకు రూ. 46కోట్లు రాబట్టింది. కాగా మూడో రోజు కూడా కలెక్షన్స్ కుమ్మేసిందని తెలుస్తుంది. నిన్న ఆదివారం కావడంతో అఖండ కలెక్షన్స్ పుంజుకున్నాయి. మూడు రోజులకు కలిపి అఖండ 2 సినిమా రూ. 61 కోట్ల వసూళ్లు రాబట్టిందని తెలుస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 76కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది.
ఆదివారం రోజున అఖండ సినిమాలు దేశవ్యాప్తంగా రూ. 15 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే బాలయ్యతోపాటు సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించారు. మాస్, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలు కలగలిసిన కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




