Richest Politicians: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నేతలు వీళ్లే..
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అనగానే మీకు ఎలాన్ మస్క్ గుర్తుకొస్తారు. కానీ పొలిటీషియన్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే.. ఎవ్వరికీ అంతగా అవగాహన ఉండదు. వ్యాపారులకు పోటీగా ఈ రాజకీయ నేతలు సంపాదిస్తున్నారు. వాళ్లెవరు.. ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలు ఇందులో తెలుసుకుందాం.
Updated on: Dec 14, 2025 | 8:28 PM

ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆదాయం సంపాదించేవారిలో వ్యాపారస్తులు, సినీ హీరోలు, క్రీడాకారులే కాకుండా రాజకీయ నేతలు కూడా ఉంటారు. వరల్డ్‌లో వ్యాపారస్తులకు పోటీగా సంపాదించేవారు చాలామందే ఉన్నారు. వివిధ దేశాల అధ్యక్షులు ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులు ఎవరో ఇందులో చూద్దాం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుల్లో తొలి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు 200 మిలియన్ డాలర్లుగా ఉంటాయని చెబుతున్నారు. ఆయిల్, సహజ వనరుల కంపెనీల్లో ఆయన భారీగా వాటాలు కలిగి ఉన్నారు. దీంతో ఆయన అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.

ఇక రెండో స్థానంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 9 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. 1994 నుంచి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రియల్ ఎస్టేట్, వ్యవసాయం, మానుఫ్యాక్చరింగ్ కంపెనీల ద్వారా ఈయనకు ఆదాయం లభిస్తుంది.

ఇక మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 7.2 బిలియన్ డాలర్లుగా ఉంది. మీడియా, ఇతర కంపెనీల్లో పెట్టుబడుల కారణంగా ఆయనకు సంపాదన వస్తుంది.

ఇక తర్వాతి స్థానంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నెట్‌వర్క్ దాదాపు 5 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మద్యం, బొగ్గు, బంగారం ద్వారా ఆయనకు ఆదాయం వస్తుందట.
