- Telugu News Photo Gallery Business photos The value of the rupee has fallen sharply against the US dollar
ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్థాయికి రూపాయి పతనం.. కారణాలు ఇవే..
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా దిగజారుతూ వస్తోంది. చరిత్రలో తొలిసారి ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో భారత్‌లో అనేక వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీని వల్ల ప్రజలపై భారం పడనుంది. రూపాయి విలువ తగ్గడానికి కారణాలు ఇవే..
Updated on: Dec 14, 2025 | 7:40 PM

రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. యూఎస్ డాలత్‌తో పోలిస్తే మన రూపీ మరింతగా దిగజారుతోంది. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొనగా..ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇటీవల ఏకంగా 54 పైసలు క్షీణించి రూ.90.48 వద్దకు చేరుకుంది. చరిత్రలో ఇది తక్కువ స్థాయిగా చెబుతున్నారు.

ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన దగ్గర నుంచి రూపీ విలువ పడిపోతూ వస్తోంది. అటు యూఎస్ డాలర్ కూడా తగ్గుతూ వస్తోంది. సుంకాల పెంపుతో రెండు దేశాల మధ్య వాణిజ్యం తగ్గుముఖం పట్టింది. విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

అయితే రూపీ విలువ పెరగడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ట్రంప్ సుంకాలు. దీంతో పాటు భారత్-అమెరికా మధ్య ఇప్పటివరకు వాణిజ్య ఒప్పందం కుదరలేదు. వచ్చే ఏడాది మార్చిలో ఈ డీల్ కుదిరే అవకాశముందని తెలుస్తోంది. అప్పటివరకు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశముంది.

ఇక మన దేశ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇటీవల మెక్సికో భారత్‌పై సుంకాలు విధించింది. రూపాయి విలువ దిగజారడానికి ఇవి కూడా కారణాలుగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం ఖారారు కాకపోతే రూపాయి విలువ మరింతగా ఒత్తడికి గురి కావొచ్చని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రూ.92కి కూడా చేరుకునే అవకాశముందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి




