14 December 2025

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా తగ్గని డిమాండ్..

Rajitha Chanti

Pic credit - Instagram

మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.

కానీ ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. 

కెరీర్ ప్రారంభం నుంచే పెద్ద హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ అయ్యింది ఈ అందాల తార. 

మిస్టర్ బచ్చన్ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. 

కానీ భాగ్యశ్రీ నటనకు మాత్రం మంచి మార్కులు వచ్చాయి. ఇటీవలే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించినప్పటికీ మరోసారి నిరాశే ఎదురయ్యింది. 

మోడలింగ్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకు అదృష్టం మాత్రం వెంటపడింది. వరుస ప్లాపులు వచ్చినప్పటికీ ఆఫర్స్ తగ్గడం లేదు.

తాజాగా ఈ అమ్మడు మరో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. 1990ల నాటి నిషేధిత కాలం నేపథ్యంలో వస్తున్న లేడీ ఓరియెంటెడ్ లో ఛాన్స్ కొట్టేసింది.

ఇందులో సామాజిక సవాళ్లను ఎదుర్కొంటూ నిలబడే నిర్భయ యువతిగా ఆమె పాత్ర ఉంటుందని టాక్. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.