AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Danger: న్యూస్ పేపర్లలో బజ్జీ, వడలు తినడం ప్రమాదకరమా! ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెబుతున్నారు

ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టీ బడ్డీలు, రోడ్డు పక్కన ఉన్న చిరు హోటళ్లలో సాయంత్రం స్నాక్స్ తినడం సాధారణం. బజ్జీలు, వడలు, బోండాలు ఎన్నెన్నో రుచులతో ఆకర్షిస్తాయి. చాలా మంది ఈ వేడి వేడి పదార్ధాలను పాత ..

Danger: న్యూస్ పేపర్లలో బజ్జీ, వడలు తినడం ప్రమాదకరమా! ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెబుతున్నారు
Food Parcel In Newspapers
Nikhil
|

Updated on: Dec 15, 2025 | 1:39 PM

Share

ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టీ బడ్డీలు, రోడ్డు పక్కన ఉన్న చిరు హోటళ్లలో సాయంత్రం స్నాక్స్ తినడం సాధారణం. బజ్జీలు, వడలు, బోండాలు ఎన్నెన్నో రుచులతో ఆకర్షిస్తాయి. చాలా మంది ఈ వేడి వేడి పదార్ధాలను పాత వార్తాపత్రికల్లో ఇస్తుంటారు. వాటిలోనే పార్శిల్ చేస్తారు. తక్కువ ఖర్చు, ఈజీగా పని పూర్తవుతుందని అనిపించినా, ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు చాలా తీవ్రమైనవి.

వార్తాపత్రికల ప్రింటింగ్ ఇంక్‌, లెడ్ వంటి భారీ లోహాలు, రసాయనాలు, పిగ్మెంట్లు, బైండర్లు, యాడిటివ్లు ఉంటాయి. ఇవి ఆహారంలో కలిసినప్పుడు ముఖ్యంగా వేడి వేడిగా ఉన్న బజ్జీలు, వడలు వంటి పదార్థాల్లోకి ఇంక్ కలిసిపోతుంది. ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి క్రమంగా పేరుకుపోయి, జీర్ణక్రియ సమస్యలు, టాక్సిసిటీ, కాలేయం, మూత్రపిండాల దెబ్బ, నాడీ వ్యవస్థ రుగ్మతలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు కలిగిస్తాయి. వీటి తయారీకి వాడే కొన్ని పదార్థాలు క్యాన్సర్ కారకాలు (కార్సినోజెనిక్) కూడా. ముఖ్యంగా పిల్లలు, యువకులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తొందరగా ఇబ్బందిపడతారు.

భారత ఆహార భద్రతా ప్రామాణిక అథారిటీ (FSSAI) 2018లోనే వార్తాపత్రికలను ఆహార ప్యాకేజింగ్ కోసం ఉపయోగించడం నిషేధించింది. అయినా చాలా చోట్ల ఈ పద్దతి కొనసాగుతోంది. వార్తాపత్రికల్లో ఆహార పదార్దాల ప్యాకింగ్ నిషేధిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి. రూల్స్‌ ఉల్లంఘించిన వారికి అధిక జరిమానాలు విధించేలా ఆదేశాలు జారీ చేయాలి.

  • అమ్మకందారులు:

నూనె పీల్చుకునేందుకు ఫుడ్ గ్రేడ్ అబ్సార్బెంట్ పేపర్ లేదా టిష్యూ పేపర్ ఉపయోగించండి. పార్శిల్ కోసం అల్యూమినియం ఫాయిల్, బ్రౌన్ పేపర్ బ్యాగులు లేదా బయోడిగ్రేడబుల్ ప్యాకెట్లు వాడండి.

  • కొనుగోలుదారులు:

వార్తాపత్రికలో ప్యాక్ చేసిన లేదా వడ్డించిన ఫుడ్‌ను తీసుకోవడానికి నో చెప్పండి. మీ బాక్స్ తీసుకెళ్లి పార్శిల్ చేయించుకోండి. ఇంట్లో కూడా వండిన పదార్ధాలను వార్తాపత్రికల్లో పెట్టి తినడాన్ని నిషేధించండి.

  • ఇలా కూడా చేయొచ్చు:

ఆహారాన్ని ప్లేట్లలో వడ్డించండి లేదా అరటి ఆకులు, మంచి క్లాత్ వంటి సహజమైన వాటిని ఉపయోగించండి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పర్యావరణానికి కూడా మంచివి.

ఈ చిన్న అలవాట్లు మార్చుకోవడం వల్ల మనం మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. రుచికరమైన బజ్జీలు, వడలు తినాలనిపిస్తే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షితమైన ప్రాంతాల్లో, శుభ్రమైన పాత్రల్లో తినండి. ఆరోగ్యమే మహాభాగ్యం.. దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తుంచుకోండి.