మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..
పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson's Disease) కేవలం వృద్ధుల్లోనే కాకుండా, ఆధునిక జీవనశైలి కారణంగా 22-49 సంవత్సరాల వారిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. వణుకు, నడకలో మార్పు, కండరాల బిగువు, మతిమరుపు వంటి ప్రారంభ లక్షణాలను ముందే గుర్తించి, సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి, సరైన వైద్యం, వ్యాయామం, ఆహారం అవసరం. కుటుంబ చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
తల, చేతులు, కాళ్లు ఒకటే వణుకుతాయి.. నడక నెమ్మదిస్తుంది.. మాట నిదానమవుతుంది.. కండరాలు బిగుసుకుపోతాయి.. ఇవి చాలవన్నట్టుగా క్రమంగా మతిమరుపు, నిద్ర సమస్యలు, కుంగుబాటు కమ్ముకొస్తాయి. మొత్తంగా జీవితమే మొద్దుబారిపోతుంది! దాదాపు 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుందనే ఇంతకాలం మనం భావిస్తూ వచ్చాం. కానీ మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా 22 నుంచి 49 వయసు వారిలో ప్రారంభ దశలో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు బయటపడుతున్నట్లు వైద్యులు అంటున్నారు. ముందే గుర్తించి ప్రారంభ దశలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్ బారిన పడితే.. ఫ్యామిలీలో మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఇది మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 80% న్యూరాన్‌లు దెబ్బతిన్న తర్వాతనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది కాబట్టి.. కండరాల్లో స్టెబిలిటీ ఉండదు. సాధారణ పనులు కూడా చేసుకోలేరు. బాధితులు నిల్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు చక్కగా ఉండలేరు. గొంతు మారుతుంది దృష్టి కూడా తగ్గుతుంది. అకస్మాత్తుగా కారణం లేకుండా చేతిరాత పరిమాణం చిన్నదిగా మారడం, దీనిని మైక్రోగ్రాఫియా అంటారు. ఇది చేతి కదలికలపై నియంత్రణ తగ్గడాన్ని సూచిస్తుంది, నడక మందగించడం, కండరాలు గట్టిగా మారడం, ఒక కాలిని నేలపై లాక్కుంటూ నడవడం, లేదా నడుస్తూ పక్కకు తిరగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి వ్యాయామం చేయకపోవడమే కారణమని అనుకునే ప్రమాదం ఉంది. మాట మునుపటితో పోలిస్తే మరింత మృదువుగా, ఊపిరితో కలిసినట్టుగా నెమ్మదిగా మారవచ్చు. చాలామంది దీన్ని స్వరపేటిక సమస్యగా భావిస్తారు. కానీ పార్కిన్సన్ వ్యాధి కండరాలను ప్రభావితం చేయడం వల్ల ఇలా జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి వివిధ రకాల టెస్ట్‌లు చేసి మందులు ఇస్తారు. డాక్టర్ల సూచన మేరకు వాటిని తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. నిపుణుల సూచనల ప్రకారమే మేం మీకు ఈ సమాచారం అందించాం. సందేహాలున్న వారు వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

