డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత అంధ మహిళా క్రికెట్ జట్టును సన్మానించారు. కెప్టెన్ దీపిక తమ ఆర్థిక ఇబ్బందులు, నివాస సమస్యలు, గ్రామంలో రోడ్ల లేమిని వివరించడంతో పవన్ కళ్యాణ్ చలించిపోయారు. జట్టు సభ్యులకు రూ.5 లక్షల చొప్పున, దీపిక గ్రామానికి రూ.3.2 కోట్ల రోడ్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.