AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Wedding Trend: పెళ్లికి వచ్చిన అతిథిలకు స్పా సేవలు..! వైరల్‌ వీడియో చూసి ప్రజల పరేషన్‌ ..

పెళ్లిలో కడుపు నిండా భోజనం చేయడం సర్వసాధారణం. కానీ, మీ అలసిపోయిన పాదాలకు కూడా విరామం దొరికితే..? అదేలా అనుకుని ఆశ్చర్యపోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పెళ్లికి వచ్చిన అతిథులకు అద్దిరిపోయే రిలాక్స్‌ అందిస్తున్నారు. వారంతా సోఫాలపై కూర్చుని ఉంటే.. ప్రొఫెషనల్ ఫుట్ మసాజ్‌లు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

Viral Wedding Trend: పెళ్లికి వచ్చిన అతిథిలకు స్పా సేవలు..! వైరల్‌ వీడియో చూసి ప్రజల పరేషన్‌ ..
Guests Get Foot Massages
Jyothi Gadda
|

Updated on: Dec 15, 2025 | 11:22 AM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే.. అది వివాహ వేడుకనా లేక లగ్జరీ స్పా కేఫ్నా అని ప్రజలు అయోమయంలో పడ్డారు. ఈ వీడియోలో అతిథులు సోఫాలపై హాయిగా కూర్చుని, కాళ్ళు చాచి ఉంచారు. యూనిఫాం ధరించిన సిబ్బంది వారికి ఫుట్ మసాజ్‌లు చేస్తున్నారు. అద్భుతమైన లైటింగ్, అందమైన, భారీ అలంకరణలతో అక్కడ పూర్తి వివాహ వాతావరణం ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం పూర్తిగా పాదాలపైనే ఉంది.

పెళ్లిలో ఫుట్ మసాజ్

ఇవి కూడా చదవండి

సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులు తినడానికి వరుసలో నిలబడి కనిపిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. అతిథులు మొదట విశ్రాంతి తీసుకుంటారు. బహుశా ఆ తర్వాత భోజనాలు అంటే మరింత ఆనందదాయకంగా ఉంటుందని అని ఆలోచించారేమో. ఈ వైరల్ వీడియోలో అతిథులు హాయిగా పాదాలకు మసాజ్‌లు తీసుకుంటున్నారు. వీడియోతో పాటు ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది.. ఇప్పుడు పెళ్లి వేడుకలు అంటే..కేవలం భోజనాలు మాత్రమే కాకుండా శారీరక విశ్రాంతిని కూడా పొందుతారు. ఇంటర్నెట్ ఇప్పుడు ఈ లైన్‌తో ఆకర్షితులవుతోంది.

ఇది పెళ్లి లేదా స్పా సెంటర్?

వీడియో వైరల్ అయిన వెంటనే కామెంట్‌ సెక్షన్‌ పూర్తిగా ఫన్నీ ఎమోజీలు, కామెంట్స్‌తో నిండిపోయింది. ఒకరు ఇలా రాశారు.. ఎవరో ఒకరు ప్రతిరోజూ ఇలాంటి వివాహాలకు ప్రజలను ఆహ్వానించండి అని రాశారు. మరొకరు, మా పెళ్లిలో కుర్చీలు కూడా సరైన స్థితిలో లేవు అని అన్నారు. కొంతమంది వినియోగదారులు దీనిని లగ్జరీ ట్రెండ్ అని పిలుస్తుండగా, మరికొందరు దీనిని అతిగా చేస్తున్నారని ఆరోపించారు.

ట్రెండా లేదా కేవలం వైరల్ జిమ్మిక్కా?

ఈ రోజుల్లో వివాహాలలో ప్రత్యేకమైన అనుభవాలను సృష్టించే ట్రెండ్ వేగంగా పెరుగుతోందని వివాహ నిపుణులు అంగీకరిస్తున్నారు. కొందరు కళాకారులతో లైవ్‌లో పాటలు పాడిస్తుంటారు. మరి కొందరు గేమ్ జోన్‌లను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు ఇప్పుడు ఫుట్ స్పా సేవలను అందిస్తున్నారు. వివాహాలు ఇకపై ఆచారాల గురించి మాత్రమే కాదు, ఇన్‌స్టాగ్రామ్ చేయగల విభిన్న క్షణాల గురించి కూడా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..