Telangana: ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
కన్నతల్లిని పుట్టినరోజు మరవకూడదని అంటారు. కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేయాలనే భావించాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు. కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎస్సై స్థాయికి ఎదిగాడు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన..

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారింది. ప్రజాసేవ చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ.. ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఉబలాటపడుతుంటారు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. ఇలా వచ్చిన ఓ అధికారికి పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కన్నతల్లిని పుట్టినరోజు మరవకూడదని అంటారు. కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేయాలనే భావించాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు. కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎస్సై స్థాయికి ఎదిగాడు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన గ్రామానికి కృతజ్ఞతగా తిరిగి సేవ చేయాలనే భావించాడు వెంకటేశ్వర్లు. ఇంకా ఐదు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఖాకీ డ్రెస్‌ను వదిలి వేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్వర్లు.. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. పులి వెంకటేశ్వర్ల విజయం నల్లేరు మీద నడకే అని అందరూ భావించారు. కానీ ఆయన అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి. అయితే ఆయనకు గ్రామస్తులు షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితం మరోలా వచ్చింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రేషన్ డీలర్ నాగయ్య చేతిలో 10 ఓట్ల తేడాతో వెంకటేశ్వర్లు ఓటమిపాలయ్యారు. ఎవరు పడితే వారు రాజకీయాల్లోకి వస్తానంటే ప్రజలు ఊరుకుంటారా మరి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








