AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ ఎంట్రీకి అదే ప్లస్ అంటున్న యంగ్ బ్యూటీ! ఎంతవరకు కలిసొస్తుందో చూద్దాం

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి అరంగేట్రం చేసి క్రేజ్ తెచ్చుకున్నా.. బాలీవుడ్‌లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు హీరోయిన్లు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఏ భాషలో సినిమా చేసినా దాదాపుగా అన్ని భాషల్లోనూ ..

బాలీవుడ్‌ ఎంట్రీకి అదే ప్లస్ అంటున్న యంగ్ బ్యూటీ! ఎంతవరకు కలిసొస్తుందో చూద్దాం
Hit And Young Heroine
Nikhil
|

Updated on: Dec 15, 2025 | 2:28 PM

Share

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి అరంగేట్రం చేసి క్రేజ్ తెచ్చుకున్నా.. బాలీవుడ్‌లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు హీరోయిన్లు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఏ భాషలో సినిమా చేసినా దాదాపుగా అన్ని భాషల్లోనూ విడుదలవుతున్నాయి. అన్ని వర్గాల, రాష్ట్రాల, భాషల సినీ ప్రేమికులను అలరించే విధంగానే సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు కూడా. అయినప్పటికీ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి సక్సెస్ కావాలని కలలు కంటుంటారు హీరోయిన్లు. ఆ జాబితాలోకి చేరాలని ఆశపడుతున్నారు మరో యంగ్ బ్యూటీ. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్నా.. తన అల్టిమేట్ గోల్ మాత్రం బాలీవుడ్ అనేంతగా ఎగ్జైట్ అవుతోంది కన్నడ బ్యూటీ.

కన్నడ చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’లో ప్రిన్సెస్ కనకవతి పాత్రలో నటించి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్. ఈ ఏడాది అతిపెద్ద హిట్‌గా నిలిచి, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించడంతో రుక్మిణి నార్త్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయనుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రుక్మిణి తన బాలీవుడ్ ప్లాన్స్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. చాలా చర్చలు జరుగుతున్నాయని, హిందీ సినిమాల్లో నటించడానికి చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పింది. హిందీ సినిమాల్లో చేయడం కొత్త అనుభూతినిస్తుందని, అందుకోసం ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటివరకు మంచి ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్ చూపించే అవకాశం రాలేదని, మంచి క్యారెక్టర్ వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పింది. త్వరలోనే అటువంటి మంచి క్యారెక్టర్ వస్తుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ యంగ్ బ్యూటీ.

Rukmini Vasanth

Rukmini Vasanth

హిందీ భాషతో తనకున్న అనుబంధం గురించి కూడా రుక్మిణి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల హిందీ భాషతో తనకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని చెప్పింది. “నా ఫాదర్ కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఆర్మీలో ఉండటంతో కంటోన్మెంట్లలో హిందీ అందరూ మాట్లాడుతారు.  అక్కడి నుంచే నాకు హిందీ బాగా అలవాటైంది” అని వివరించింది. ఈ కారణంగా హిందీలో నటించడానికి భాషా అడ్డంకి కాదని చెప్పకనే చెబుతోంది.

29 ఏళ్ల రుక్మిణి వసంత్ ఇప్పటికే ‘సప్త సాగరదాచె ఎల్లో’, ‘బఘీరా’ వంటి కన్నడ చిత్రాలలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక యశ్‌తో ‘టాక్సిక్’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ వంటి పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో కనిపించనుంది. బాలీవుడ్ ఎంట్రీతో కెరీర్ పీక్స్‌కు చేరుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

ఎన్నికల్లో పార్టీ ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త
ఎన్నికల్లో పార్టీ ఓటమి.. మీసాలు తీయించుకున్న కార్యకర్త
న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పనులు చేస్తే జైలుకే.. పోలీసుల కొత్త రూల్స్.
న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పనులు చేస్తే జైలుకే.. పోలీసుల కొత్త రూల్స్.
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది