స్టార్ హీరోయిన్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే
రేణుకాస్వామి హత్య కేసు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. సినీ పరిశ్రమలోని స్టార్ హీరో దర్శన్ ప్రియురాలి మోజులో పడి వీరాభిమానినే దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు కటాకటాల పాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో సహా మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు.

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అభిమాని రేణుకాస్వామి హత్యోదంతంతో ఇదంతా మొదలైంది. ఈ కేసులో దర్శన్ , నటి పవిత్ర గౌడ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ కేసు ఎప్పటి నుంచో నడుస్తుంది. రేణుకస్వామి మర్డర్ కేసు కన్నడ సినీ పరిశ్రమలో పెను దుమారం రేపింది. ఈకేసులో హీరో దర్శన్, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడతోపాటు మరో 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తనకు అసభ్యకరంగా సందేశాలు పంపుతూ.. తనను వేధించాడనే కోపంతో తన ప్రియుడు దర్శన్ తో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేయించింది పవిత్ర గౌడ.
ప్రస్తుతం బెంగుళూరు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్శన్, పవిత్ర కొన్నిరోజులుగా జైలులో ఉన్నారు. ఒక వ్యక్తిని హత్య చేయించిన పవిత్రకు తాజాగా కర్ణాటక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. మరో ఏడాది పాటు ఆమె జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు అయ్యింది. కాగా హత్య కేసులో ఆమె ప్రధాన ముద్దాయి కావడంతో పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు పవిత్ర బెయిల్ ను రద్దు చేసింది. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
కాగా దాదాపు మూడు నెలలుగా ఆమె జైలులోనే మగ్గుతున్నారు. కాగా ఇప్పుడు ఆమె బెయిల్ కోసం పవిత్ర న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. దాంతో పవిత్రకు నిరాశ ఎదురైంది. కాగా పవిత్రలు బెయిలు రావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని కర్ణాటకలో వినిపిస్తుంది. దాంతో పవిత్ర మరో ఏడాది పాటు జైల్లోనే ఉండనుందని తెలుస్తుంది. ఇక హీరో దర్శన్ కూడా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.. ఆయన జైలునుంచి త్వరగా బయటకు రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




