కోహ్లీ తిరుగులేని రికార్డ్ బద్దలు కొట్టిన తెలుగబ్బాయ్.. టీ20లో సరికొత్త చరిత్ర..!
Tilak varma: కేవలం 23 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడి రికార్డును అధిగమించడం సామాన్య విషయం కాదని మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడే అతని తత్వం టీమ్ ఇండియాకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) సాధించిన ఒక అరుదైన రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ బ్యాటర్, ‘చేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు.
ఏంటి ఆ రికార్డు?
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ‘సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్’లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కాగా, ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ సగటు 67.10గా ఉంది. అయితే, తాజా ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ సగటు 68.00కి చేరింది.
దీంతో టీ20 ఫార్మాట్‌లో లక్ష్య ఛేదనలో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్‌గా (కనీసం 500 పరుగులు చేసిన వారిలో) తిలక్ వర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
మ్యాచ్ విశేషాలు..
ఈ మ్యాచ్‌లో 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మ నిలకడగా ఆడాడు. అతను 34 బంతుల్లో 25 పరుగులు (నాటౌట్) చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. జట్టును గెలిపించి ‘ఫినిషర్’గా తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు.
మరో రికార్డు కూడా..
కేవలం ఛేజింగ్ రికార్డు మాత్రమే కాదు, ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై తిలక్ వర్మ సగటు 70.50గా నిలిచింది. ఇదివరకు పాకిస్థాన్‌పై కోహ్లీకి ఉన్న 70.28 సగటు రికార్డును అధిగమించాడు.
తెలుగోడిపై ప్రశంసలు:
కేవలం 23 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడి రికార్డును అధిగమించడం సామాన్య విషయం కాదని మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడే అతని తత్వం టీమ్ ఇండియాకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తిలక్ వర్మ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు బద్దలవ్వడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




