New Year Celebrations: ఈ సారి న్యూ ఇయర్ వేడుకలకు కఠిన రూల్స్.. ఇవి పాటించకపోతే జైలుకే.. కీలక మార్గదర్శకాలు జారీ
మరికొద్దిరోజుల్లో న్యూ ఇయర్ వస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా కఠిన నిబంధనలు విడుదల చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా వేడుకలు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. అవేంటో చూద్దాం.

మరో 15 రోజుల్లో 2025 ముగిసి కొత్త ఏడాది 2026 రానుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం రెడీ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నూతన ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే దానిపై ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లో డిసెంబర్ 31 రాత్రి ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పబ్స్, హోటల్స్, రెస్టారెంట్, క్లబ్స్‌లో గ్రాండ్‌గా ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు వేదికలు సిద్దం చేస్తున్నాయి. వీటికి ఎంట్రీ టికెట్లను కూడా విడుదల చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఒంటి గంట వరకు సెలబ్రేషన్స్
ఈ మార్గదర్శకాల ప్రకారం పబ్‌లు, బార్లు, క్లబ్‌లు, హోటల్స్, రెస్టారెంట్స్ డిసెంబర్ 31 అర్థరాత్రి 1 గంటల వరకు సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు. ఈ వేడుకలకు మైనర్లను అసలు అనుమతించకూడదు. అలాగే ఈవెంట్ జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. అశ్లీల ప్రదర్శనలు ఈవెంట్లలో చేయకూడదు. న్యూ ఇయర్ వేడుకలు జరిపే యాజమాన్యాలు 15 రోజుల ముందే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి.
బహిరంగంగా సౌండ్ సిస్టమ్స్ బంద్
ఇక రోడ్లపై బహిరంగంగా సౌండ్ సిస్టమ్స్ పెట్టడంపై నిషేధం విధించారు. హోటల్స్, బాంక్వెట్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్‌లో ఇండర్‌లోనే సౌండ్ సిస్టమ్‌కు రాత్రి 1 గంటల వరకు అనుమతి ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత 45 డెసిబెల్స్ మించకుండా సౌండ్ పెట్టుకోవాలి. ఇక ఈవెంట్లలో ఆయుధాలకు అనుమతి ఉండదు. ఇక ఈవెంట్ సామర్థ్యం కంటే ఎక్కువ పాసులు, టికెట్లు జారీ చేయకూడదు. ఇక వేడుకల్లో మత్తు పదార్థారాలు వాడకూడదు. మద్యం తాగిన కస్టమర్లకు ఈవెంట్ నిర్వహకులు డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన టైమ్ ప్రకారం కస్టమర్లకు మద్యం అందించాలి.
కఠిన చర్యలు
ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తే రూ.10 వేల పెనాల్టీ లేదా ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈవెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక రోడ్లపై అల్లరి చేసేవారికి కూడా చర్యలు తీసుకుంటామని, ప్రశాంతంగా వేడుకలు జరిగేలా అందరూ సహకరించాలని పోలీసులు కోరారు.
The Commissioner of Police, Hyderabad issues the following guidelines to the managements of 3 Star & above Hotels, Clubs and Bars and Restaurants/Pubs with regard to New Year celebrations on the intervening night of 31-12-2025 / 01-01-2026.
1. The managements of 3 Star & above…
— Hyderabad City Police (@hydcitypolice) December 13, 2025




