రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై సూపర్ అప్‌డేట్
రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా గురించి కమల్ హాసన్ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. 2027లో సినిమా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రం రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడి ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ లెజెండరీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వారి దీర్ఘకాల నిరీక్షణకు తెరదించనుంది.
రజినీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి నటించబోతున్నారనే న్యూస్ తెలిసిన రోజు నుంచే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే అదెప్పుడు తెరపైకి వస్తుంది.. డైరెక్టర్ ఎవరు.. ఫ్యాన్స్ ఇగోలు దెబ్బ తీయకుండా, ఇమేజ్ పాడు కాకుండా ఈ సినిమాను హ్యాండిల్ చేసేదెవరు..? సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది..? వీటన్నింటిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. సౌత్ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరూ ఇద్దరే. లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం. రజినీ కమర్షియల్ మార్కెట్‌లో తోపు అయితే.. కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే రికార్డులు తిరగరాస్తుంటారు. కెరీర్ మొదట్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు.. పైగా ఇద్దరిదీ బాలచందర్ స్కూల్ కావడంతో ఇగోలు పక్కనబెట్టి అప్పట్లో నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమా తర్వాత పూర్తిస్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజినీ, కమల్. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడంతో.. వాళ్లిద్దరితో మల్టీస్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టర్ చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా ప్లాన్ చేసినా.. కరోనా కారణంగా ఆగిపోయింది. తాజాగా రజినీ బర్త్ డే స్పెషల్‌గా తమ స్పెషల్ AI వీడియో విడుదల చేసారు కమల్. రజినీతో మల్టీస్టారర్ అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించనుంది. దర్శకుడి కోసం వేట సాగుతుంది.. జైలర్ 2 తర్వాత రజినీ ఏ సినిమా సైన్ చేయలేదు.. కమల్ కూడా కథ కోసమే చూస్తున్నారు. అవన్నీ కుదిర్తే 2026లో తమ మల్టీస్టారర్ పట్టాలెక్కించి.. 2027లో విడుదల చేయాలని చూస్తున్నారు లోకనాయకుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

