Vastu Tips: చీపురు ఈ దిక్కున పెడితే ఇంట్లో ఐశ్వర్యం.. డబ్బుకు లోటుందట..
Broom Vastu Tips: ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలన్నా, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా .. చీపురు విషయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలంటున్నారు.. అంతేకాకుండా.. ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా.. తలకిందులుగా పెట్టకుండా చూసుకోవడం లక్ష్మీదేవి అనుగ్రహానికి ముఖ్యం అంటున్నారు జ్యోతిష్యులు.. చీపురును ఇంట్లో ఏ దిశలో ఉంచితే మంచిదో తెలుసుకుందాం..

ఇంట్లో వస్తువులను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం.. దీనివల్ల పలు ప్రభావాలను నివారించడంతోపాటు.. ఎన్నో సానుకూల అంశాలను పొందవచ్చని వాస్తుశాస్త్రం చెబుతోంది.. ఇంటి వాస్తు.. ఇంట్లో వస్తువుల వాస్తు సరిగ్గా ఉంటే, ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతుంటారు. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఇంట్లో శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు కూడా సరైన దిశలో ఉండాలి.. లేకపోతే.. ఎన్నో సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. వాస్తవానికి హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు.. అందుకే చీపురును కాళ్లతో తాకకూడదు.. తన్నకూడదని చెబుతారు. అంతేకాదు.. ఇంట్లో చీపురును ఎక్కడ ఉంచాలి? ఎలా ఉంచితే.. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది..? అనే విషయాలను కూడా జోతిష్యశాస్త్రం స్పష్టంగా చెబుతోంది.. చీపురు ఎక్కడ ఉంచాలో తెలియక చేసే తప్పులతో ఇంట్లో పేదరికం, సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
అందుకే.. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలన్నా, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా .. చీపురు విషయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలంటున్నారు.. అంతేకాకుండా.. ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా.. తలకిందులుగా పెట్టకుండా చూసుకోవడం లక్ష్మీదేవి అనుగ్రహానికి ముఖ్యం అంటున్నారు జ్యోతిష్యులు..
ఇంట్లో చీపురును ఎక్కడ ఉంచాలి..
ఇంట్లో ఎల్లప్పుడూ చీపురును దక్షిణ భాగం దిశలో.. లేదంటే పడమర, నైరుతి దిక్కులో ఉంచాలి.. దక్షిణ భాగం, పడమర భాగం, నైరుతి భాగంలో అస్సలు ఉంచకూడదు. అలాగే.. ఎవరికీ కనిపించకుండా చూడాలి. బెడ్ రూమ్, కిచెన్ లో చీపురును అస్సలు ఉంచకూడదు..
చాలా మంది ఇంటి మెయిన్ డోర్ దగ్గర చీపురు పెడతారు.. అలాగే చిందవందరగా పడేస్తారు.. అలా ఉంచడం వల్ల.. నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని.. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.. చీపురు తలకిందులుగా కూడా ఉంచకూడదు. ఇలా ఉంచితే లక్ష్మీదేవి అవమానంగా భావిస్తుందట.. అందుకే.. దానిని ఎల్లప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి.
అలాగే.. కొత్త చీపురును మంగళ, శుక్ర, శనివారాలు కొనడం శుభప్రదం అంటున్నారు జ్యోతిష్య పండితులు.. ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని, లక్ష్మి దేవి కటాక్షం కలుతుందని.. పేర్కొంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




