ఒక్క స్పెర్మ్‌తో జన్మించిన 197 మంది పిల్లలు.. కట్‌చేస్తే.. అదొక జన్యుపరమైన టైమ్‌బాంబ్..! ఏక్షణంలోనైనా..
ఒక స్పెర్మ్.. వందలాది జీవితాలను పెను ప్రమాదంలోకి నెట్టేసింది.. ఒక నిశ్శబ్ద క్యాన్సర్ జన్యువును ప్రసరించేలా చేసింది. యూరోపియన్ చరిత్రలో అత్యంత భయంకరమైన వైద్య ఆవిష్కరణ ఇది.. ఈ కథ కేవలం సైన్స్ గురించి మాత్రమే కాదు. వ్యవస్థాగత నిర్లక్ష్యం గురించి కూడా వివరిస్తోంది.. ఒక రకంగా ఇది మానసికంగా కూడా కుంగదీసే విషయం.

యూరప్‌లో ప్రస్తుతం హర్రర్ థ్రిల్లర్ లాగా అనిపించే ఒక రహస్యం బయటపడింది. ఇది సినిమా కథ కాదు. వాస్తవికత. ఒక స్పెర్మ్ దాత తెలియకుండానే 197 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఏ క్షణంలోనైనా పేలిపోయే జన్యుపరమైన టైమ్ బాంబును వారికి వదిలివేసాడు. యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ దీనిని పరిశోధనాత్మక జర్నలిజం కింద బహిర్గతం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగ సంచలనం సృష్టించింది.
అసలు విషయం ఏమిటంటే..
యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (EBU) ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బృందం ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. డానిష్ స్పెర్మ్ బ్యాంక్ నుండి తీసుకున్న స్పెర్మ్‌ను 14 దేశాలలోని 67 ఫెర్టిలిటీ క్లినిక్‌లలో ఉపయోగించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ స్పెర్మ్ నుండి జన్మించిన పిల్లల సంఖ్య కనీసం 197 అని చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని కూడా అంటున్నారు. కానీ, కథ అక్కడితో ముగియలేదు. దీని తర్వాత నిజమైన భయానకం ప్రారంభమవుతుంది. యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (EBU) ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్‌వర్క్‌లో భాగంగా మరో 15 పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్లు ఈ దర్యాప్తును నిర్వహించారు.
యూరప్‌లో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. 197 మంది మహిళలను స్పెర్మ్ బ్యాంక్ ద్వారా గర్భం దాల్చేలా చేశారు. తరువాత జరిపిన దర్యాప్తులో మహిళలు ఉపయోగించిన స్పెర్మ్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే లోపభూయిష్ట జన్యువు ఉందని తేలింది. సుమారు 14 దేశాలకు చెందిన మహిళలు ఈ స్పెర్మ్‌ను ఉపయోగించి గర్భం దాల్చేలా చేశారు. దీని నుండి 197 మంది పిల్లలు జన్మించారని అంచనా. ఈ లోపభూయిష్ట జన్యు పరివర్తన కారణంగా చాలా మంది పిల్లలు మరణించారని తెలిసింది. అటువంటి పరిస్థితిలో, ఈ స్పెర్మ్ నుండి జన్మించిన పిల్లలందరికీ క్యాన్సర్ వస్తుందా ..? అనేది అతిపెద్ద ప్రశ్న.
నివేదిక ప్రకారం, ఆ స్పెర్మ్ ఒక అనామక వ్యక్తి నుండి వచ్చింది. ఈ ప్రక్రియకు గానూ అతనికి ముందుగానే డబ్బు చెల్లించారు. ఈ ప్రక్రియ 2005లో ప్రారంభమైంది. అతని స్పెర్మ్‌ను దాదాపు 17 సంవత్సరాలు స్త్రీలను గర్భం ధరించడానికి ఉపయోగించారు. అయితే, ఆ సమయంలో అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. స్క్రీనింగ్ టెస్ట్‌లలో అతడు ఆరోగ్యవంతుడిగా తేలింది. డెన్మార్క్‌లోని యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ నిల్వ చేసిన డెన్మార్క్‌లోని సంతానోత్పత్తి క్లినిక్‌లో అతని నుండి స్పెర్మ్ సేకరించబడింది. ఆపై వివిధ కేంద్రాలకు విక్రయించబడింది. అప్పటి నుండి స్పెర్మ్ అనేక ప్రదేశాలకు ప్రయాణించింది.
ఈ స్పెర్మ్‌ను దానం చేసిన వ్యక్తి యూరప్‌లోని 197 మంది తల్లిదండ్రుల కలలను నెరవేర్చాడు. కానీ అతను క్యాన్సర్ కలిగించే క్యారియర్ జన్యువును కలిగి ఉన్నాడని అతనికి తెలియదు. ప్రారంభ దశలో స్పెర్మ్ నాణ్యత బాగుంటే, దానిని గర్భధారణ కోసం ఇస్తారు. సాధారణంగా, జన్యువును పరీక్షించరు. తత్ఫలితంగా, లోపభూయిష్ట జన్యువు తల్లి గర్భానికి చేరి బిడ్డకు జన్మనిస్తుంది. విచారకరంగా ఈ జన్యువుతో జన్మించిన కొంతమంది పిల్లలు కూడా మరణించారు. మరింత విషాదకరంగా ఈ జన్యు పరివర్తనను వారసత్వంగా పొందిన పిల్లలలో కొద్దిమంది మాత్రమే క్యాన్సర్ నుండి బయటపడే అదృష్టవంతులు. అయితే, ఈ పిల్లలు ఉన్న కుటుంబాలకు దీని గురించి సమాచారం అందించబడింది
ఈ స్పెర్మ్ నుండి జన్మించిన పిల్లల శరీరంలోని ప్రతి కణంలో ఈ లోపభూయిష్ట జన్యువు ఉంటుంది.
ఈ మ్యుటేషన్‌ను వైద్య భాషలో లి-ఫ్రామిని సిండ్రోమ్ అంటారు.
ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారికి జీవితాంతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90శాతం వరకు ఉంటుంది.
బాల్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం.
మెదడు కణితి, ఎముక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఇప్పటివరకు 67 మంది పిల్లలను పరీక్షించారు.
ఈ మ్యుటేషన్ 23 లో నిర్ధారించబడింది. 10 మంది పిల్లలలో క్యాన్సర్ నిర్ధారణ. చాలా మంది పిల్లలు చనిపోయారని తెలిసింది.
లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన ప్రొఫెసర్ క్లైర్ టర్న్‌బుల్ ఇలా అంటున్నారు, ఇది జీవితాంతం ఉండే భయం. ఏటా MRIలు, అల్ట్రాసౌండ్‌లు, నిరంతర పరీక్షలు అవసరం ఉంటుంది. ఒక రకంగా ఇది మానసికంగా కూడా కుంగదీసే విషయం అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




