AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman Setty: ఆ డైరెక్టర్ షూటింగ్‌ లొకేషన్‌లో కొట్టాడు.. క్లియర్‌గా చెప్పేసిన సుమన్ శెట్టి

సుమన్ శెట్టి వైజాగ్ వాసిగా తన పుట్టిన ఊరిపై ఉన్న అపోహలను క్లారిఫై చేశారు. దర్శకుడు తేజ జై సినిమా షూటింగ్‌లో తనను కొట్టడం తన అదృష్టాన్ని మార్చిందని తెలిపారు. అనేక భాషల్లో నటించిన అనుభవాలను, తన వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Suman Setty: ఆ డైరెక్టర్ షూటింగ్‌ లొకేషన్‌లో కొట్టాడు.. క్లియర్‌గా చెప్పేసిన సుమన్ శెట్టి
Suman Setty
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2025 | 4:22 PM

Share

తెలుగు హాస్య నటుడు సుమన్ శెట్టి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్‌ లైఫ్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన పుట్టిన ఊరు మిర్యాలగూడ అనే ప్రచారంపై క్లారిటీ ఇస్తూ, తాను విశాఖపట్నం (వైజాగ్)లో పుట్టి పెరిగానని, 100% విశాఖ వాసినని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించాడు. వైజాగ్‌లోని జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్ ప్రాంతాలతో తనకు ఉన్న సంబంధంపై అడిగిన ప్రశ్నకు, తాను రౌడీ బ్యాచ్ కాదని, వెరీ డీసెంట్ ఫెలో అని స్పష్టం చేశాడు. తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, దర్శకుడు తేజ జై సినిమాలో తనకు తొలి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఒక ర్యాగింగ్ సీన్ సందర్భంలో, డబుల్ లుక్ ఇవ్వడంలో తికమకపడటంతో తేజ తనను ఒకసారి కొట్టారని వెల్లడించాడు. ఆయన రెండు దెబ్బలు వేశారని, అయితే ఆ దెబ్బ విలువ ఆ తర్వాత తెలిసిందని సుమన్ శెట్టి వివరించారు. తేజ చేతిలో దెబ్బలు తిన్న వారందరూ అదృష్టవంతులని, మంచి రేంజ్, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉందని తెలిపాడు. ఆ సంఘటన తర్వాత తాను తేజ సార్‌ను మరోసారి కొట్టమని సరదాగా కోరినట్లు చెప్పాడు. అప్పుడు ఆయన సుమన్ శెట్టి నుంచి సుమన్ అంబానీ కావాలనుకుంటున్నావా అని సరదాగా అన్నట్లు గుర్తు చేసుకున్నాడు.

తొలి సినిమాలో అవకాశం కోసం డబ్బలు ఇచ్చావా అని ప్రశ్నించగా తనకే తిరిగి రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. భగవంతుడి దయ, తల్లిదండ్రుల సహాయంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని  తెలిపాడు. సుమన్ శెట్టి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి వంటి ఇతర భాషల్లోనూ నటించాడు. మాతృభాషలో నటించడం సులభమని, ఇతర భాషల్లో కొంచెం కష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తమిళం మాట్లాడగలనని, అయితే కన్నడ, మలయాళం, భోజ్‌పురి భాషలపై తనకు అంత పట్టు లేదని చెప్పాడు. అయినప్పటికీ, తన తెలిసిన వ్యక్తులు, దర్శకుల ప్రోత్సాహంతో ఆ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నానని పేర్కొన్నాడు. తన వివాహం గురించి ప్రస్తావిస్తూ, తాను కొంచెం నల్లగా ఉంటానని, అందుకే చూడటానికి బాగా ఉండాలని ఎత్తుగా, తెల్లగా ఉండే అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నానని వివరించారు.

బిగ్‌బాస్‌ తెలుగు 9లో 14 వారాల పాటు వీక్షకులను మెప్పించిన సుమన్ శెట్టి.. ఇటీవలే ఎలిమినేట్ అయ్యారు.  14 వారాలు హౌస్‌లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.