చీరకట్టులో కవ్విస్తున్న అందాల అనసూయ.. ఫిదా అవుతున్న నెటిజన్స్

15 December 2025

Pic credit - Instagram

Rajeev 

అనసూయ భరధ్వాజ్.. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ బేస్ ఉంది. యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది.

ఈ కామెడీ షోలో తన యాంకరింగ్‌తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. 

ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫొటోలకు, వీడియోలకు మంచి క్రేజ్ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.